అభిమానులకు భారీ షాక్ ఇచ్చిన మ్యాక్ వెల్.. టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్..?
అయితే ప్రస్తుతం సీనియర్ క్రికెటర్ గా కొనసాగుతున్న మ్యాక్స్వెల్.. ఆస్ట్రేలియా జట్టులో 3 ఫార్మాట్లలో కూడా కొనసాగుతున్నాడు. అయితే ప్రస్తుతం ఫామ్ లోకి వచ్చి దూసుకుపోతున్నాడు అని మ్యాక్స్వెల్ అభిమానులు అందరూ సంతోష పడుతున్న తరుణంలో ఇటీవల అభిమానులు షాక్ అయ్యే వార్త చెప్పుకొచ్చాడు మాక్స్వెల్. తనకు టెస్ట్ క్రికెట్ ఆడటం పై ఆసక్తి లేదని.. ప్రస్తుతం తన దృష్టి మొత్తం పరిమిత ఓవర్ల క్రికెట్ పైనే ఉంది అంటూ ఇటీవల మాక్స్వెల్ చెప్పుకొచ్చాడు. దీంతో అభిమానులు అందరూ షాక్ అవుతున్నారు.
టెస్ట్ క్రికెట్ లో ఆడే అవకాశం ఇక లేదు అంటూ చెప్పుకొచ్చాడు మాక్స్వెల్. కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్ పైనే తన దృష్టి పెడతానని టెస్ట్ క్రికెట్ జట్టులో స్థానం సంపాదించడానికి భారీగా పోటీ నెలకొంది అంటూ చెప్పుకొచ్చాడు. అందుకే ఇక మరి కొన్ని రోజుల్లో తాను టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకొని కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్ పై మాత్రమే దృష్టి పెట్టి 2023 ప్రపంచ కప్ కోసం ఇప్పటి నుంచే సిద్ధం అవుతాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం మ్యాక్స్వెల్ చేసిన వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ గా మారిపోయాయి. ఇక మరికొన్ని రోజుల్లో మాక్స్వెల్ టెస్ట్ క్రికెట్ నుంచి అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించ బోతున్నాడు అన్నది అర్థమవుతుంది. దీంతో అభిమానులు అందరూ షాక్ అవుతున్నారు.