వయస్సు శాశ్వతం కాదు.. భార్య చేతిలో కర్ర మాత్రం ఎప్పటికీ శాశ్వతం.. సెహ్వాగ్ చలోక్తి..?

praveen
భారత క్రికెట్లో మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో ఏళ్ల పాటు భారత జట్టులో స్టార్ ఓపెనర్ గా సేవలందించాడు వీరేంద్ర సెహ్వాగ్. మైదానంలో ఎంతో దూకుడుగా వ్యవహరించే వీరేంద్ర సెహ్వాగ్ అటు స్కోరు  బోర్డును పరుగులు పెట్టించేవాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. భారత జట్టుకు విజయాలను అందించడంలో వీరేంద్ర సెహ్వాగ్ పాత్ర కూడా ఎంతో కీలకం అని చెప్పాలి.  అయితే ఇక భారత జట్టులో వీరేంద్ర సెహ్వాగ్ ఎన్నో రోజుల పాటు అద్భుతంగా రాణించిన నేపథ్యంలో ఎంతోమంది క్రికెట్ ప్రేక్షకులు కూడా వీరేంద్ర సెహ్వాగ్ ను అమితంగా అభిమానిస్తూ ఉంటారు.

 అయితే ఒకప్పుడు మైదానంలో దూకుడుగా వ్యవహరించడమే కాదు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ చలోక్తులు విసురుతూ హాట్ టాపిక్ గా  మారిపోతూ ఉంటాడు అనే విషయం తెలిసిందే. క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ..  తన చలోక్తులకు మాత్రం ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదు వీరేంద్ర సెహ్వాగ్. ఇక ఏ అంశంపైన అయినా సరే తన దైన శైలిలోస్పందిస్తూ జోకులు పేలుస్తూ ఉంటాడు వీరేంద్ర సెహ్వాగ్. కాగా ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడు. కాగా ఇటీవలే వీరేంద్ర సెహ్వాగ్ పోస్ట్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో అటు మొత్తం సోషల్ మీడియాను ఊపేస్తున్నది.


 ఇటీవలే ఒక కార్యక్రమం దగ్గర డీజే ముందు అందరు డాన్సు చేస్తున్న సమయంలో ఒక తాత గోచి కట్టు కొని అందరితో డాన్సులు చేస్తూ ఉంటాడు.. ఇంతలో అటు వైపు నుంచి కర్ర  పట్టుకొని మెల్లిగా నడుచుకుంటూ వచ్చిన ఆ తాత భార్య కొట్టడానికి వెళ్లగా.. డాన్స్ చేస్తున్న తాత  అక్కడి నుంచి పరుగులు పెడతాడు.  ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన వీరేంద్ర సెహ్వాగ్ వెంటనే ఈ వీడియో ని తన సోషల్ మీడియా ఖాతా లో పోస్ట్ చేశాడు. అంతేకాదు దీనికి ఒక ఫన్నీ ట్యాగ్  కూడా జత చేశాడు. వయస్సు అనేది శాశ్వతం కాదు.. భార్య చేతిలో కర్ర అనేది ఎప్పటికీ శాశ్వతం అంటూ వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: