టీమిండియా పై గెలవడం ఎంతో కష్టం.. ఇంగ్లాండ్ మాజీ కోచ్ షాకింగ్ కామెంట్స్..?

praveen
ఏడాది చివర్లో ఐపీఎల్  ఎంతో రసవత్తరంగా సాగింది అనే విషయం తెలిసిందే. కరోనా  వైరస్ వ్యాప్తి దృశ్య ఐపీఎల్  జరుగుతుందా లేదా అని అనుమాన  పడినప్పటికీ ఇక ఐపీఎల్ టోర్నీ భారత్లో కాకుండా యూఏఈ వేదికగా జరిగింది. అయితే భారత పర్యటన ముగియగానే భారత ఆటగాళ్లు ఆస్ట్రేలియా పర్యటన కోసం బయలుదేరారు.  ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టెస్టు సిరీస్లో భారత జట్టు ఒక చారిత్రాత్మక విజయాన్ని నమోదుచేసింది అన్న విషయం తెలిసిందే. భారత క్రికెట్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఆస్ట్రేలియా జట్టు కంచుకోట లాంటి గబ్బా  స్టేడియం లో విజయం సాధించి టెస్ట్ సిరీస్ను కైవసం చేసుకుంది.

 అది కూడా జట్టులో ఎలాంటి అనుభవం లేని ఆటగాళ్ళు ఉన్నప్పటికీ కూడా దిగ్గజ  జట్టుగా కొనసాగుతున్న ఆస్ట్రేలియా జట్టును మట్టి కరిపించడం అద్భుతం అనే చెప్పాలి. ఈ క్రమంలోనే ఇప్పటికీ కూడా భారత జట్టు ఆటతీరుపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. అయితే ఇటీవలే ఆస్ట్రేలియా పర్యటన ముగించుకున్న భారత జట్టు మరికొన్ని రోజుల్లో ఇంగ్లాండ్ జట్టుతో స్వదేశంలో వరుసగా సిరీస్ లు  ఆడనుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ జట్టు మాజీ కోచ్  ఆడి ఫ్లవర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  ఆస్ట్రేలియాపై విజయంతో టీమిండియా ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగి పోయిందని.. ప్రస్తుత సమయంలో భారత జట్టును ఓడించడం ఎంతో  కష్టం అంటూ చెప్పుకొచ్చాడు.  ఇలాంటి సమయంలో భారీ స్కోరు చేసింది భారత జట్టును ఓడించేందుకు ఇంగ్లాండ్ జట్టుకు అవకాశం ఉంది అని చెప్పుకొచ్చాడు.

ఇకపోతే గతంలో ఇంగ్లాండ్ జట్టు కోచ్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.  ఆస్ట్రేలియాపై విజయంతో భారత జుట్టు ఎంతో సంతోషంగా ఉందని కానీ ఆ తరువాత అసలు సిసలైన జట్టు తో తలపడిబోతుంది అన్న విషయాన్ని భారత జట్టు గుర్తుంచుకోవాలి అంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మరి కొన్ని రోజుల్లో భారత్ ఇంగ్లాండ్ మధ్య సిరీస్ ప్రారంభం కానుండగా ఎవరు ఆధిపత్యం సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: