నటరాజన్.. ఇంకా నువ్వు చేయాల్సింది చాలా ఉంది..?
ఇక ఆస్ట్రేలియా టూర్ లో మొదటి టి20 సిరీస్ లో ఎంపికయిన నటరాజన్ ఆ తర్వాత తన అద్భుతమైన ప్రదర్శన తో వన్డే సిరీస్ లో కూడా స్థానం దక్కించుకున్నాడు.. ఇక ఆ తర్వాత టెస్టు సిరీస్లో కూడా స్థానం దక్కించుకొని అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే యువ ఆటగాడు నటరాజన్ ప్రదర్శన తీరుపై ప్రస్తుతం ఎంతో మంది మాజీ క్రికెటర్లు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవలే టీమిండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ నటరాజన్ కు కీలక సూచనలు చేశాడు.
ఆస్ట్రేలియా టూర్ లో అదరగొట్టిన బౌలర్ నటరాజన్ టెస్ట్ క్రికెట్లో ఇంకా చేయాల్సింది చాలా ఉంది అంటూ వ్యాఖ్యానించాడు టీమిండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్. అతనికి ఆ బౌలింగ్ శైలి అదృష్టం అంటూ వ్యాఖ్యానించిన ఇర్ఫాన్ పఠాన్ బౌలింగ్ లో ఇంకా మెళకువలు నేర్చుకోవాలి అంటూ చెప్పాడు. ఇక అదే సమయంలో ఫిట్ నెస్ పై కూడా మరింత దృష్టి పెట్టాలని దేశం కోసం ఐదు నుంచి ఏడు సంవత్సరాల వరకు ఆడేలా ఫిట్నెస్ సాధించాలి అని సూచించాడు. నటరాజన్ మరింత మెరుగయ్యేందుకు బిసిసిఐ కృషి చేస్తుంది అని నమ్ముతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.