గబ్బా హీరో రిషబ్ పంత్ కి కీలక బాధ్యతలు.. ఫాన్స్ హ్యాపీ..?
భారత జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించడంలో కీలక పాత్ర వహించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా బ్రిస్బేన్ వేదికగా జరిగిన చివరి టెస్టులో కీ రోల్ పోషించాడు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు రిషబ్ పంత్ బ్యాటింగ్ సామర్థ్యంపై అనుమానాలు ఉన్నప్పటికీ ఇక బ్రిస్బేన్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ లో తొలగిపోయాయి. ఈ క్రమంలోనే ఇటీవలే ఆస్ట్రేలియా పర్యటన ముగించుకున్న భారత జట్టు మరికొన్ని రోజుల్లో ఇంగ్లాండ్ జట్టుతో స్వదేశంలో సుదీర్ఘ సిరీస్ ఆడనుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సిరీస్ లో భాగంగా రిషబ్ పంత్ కి కీలకమైన బాధ్యతలు అప్పగించపోతున్నట్లు టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ స్పష్టం చేశారు
భారత్ లో ఇంగ్లాండ్ జట్టు 50 రెండు రోజుల పాటు పర్యటించనున్నారు.. ఈ క్రమంలోనే టెస్ట్,టి20, వన్డే సిరీస్ ఆడనుంది ఇంగ్లాండ్ జట్టు. ఇక ప్రస్తుతం రిషబ్ పంత్ మంచి ఫామ్ లో ఉండడంతో అతనికి మూడు ఫార్మాట్లలో కూడా అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది. అయితే రిషబ్ పంత్ తనదైన రోజు మ్యాచ్ ని అలవోకగా గెలిపించగలడు అన్న నమ్మకం ఉందని.. ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్ కావడం జట్టుకు మరింత అదనపు లాభం చేకూరుస్తుందని త్వరలో అతనిని మిడిల్ ఆర్డర్ బాధ్యతలు అప్పగించనున్నామని టీమిండియా బ్యాటింగ్ కోచ్ వెల్లడించారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టెస్టు సిరీస్లో అద్భుతంగా రాణించిన రిషబ్ పంత్ రానున్న రోజుల్లో ఇంగ్లాండ్ తో జరగబోయే సిరీస్ లో ఎలా రాణించ బోతున్నాడు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.