వాళ్లు మనల్ని ఓడించలేరు.. గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు..?

praveen
ఫిబ్రవరి 5వ తేదీ నుంచి భారత్ ఇంగ్లాండ్ మధ్య స్వదేశంలో టెస్ట్ సిరీస్ జరగబోతోంది అన్న విషయం తెలిసిందే. చెన్నైలోని చేపాక్ స్టేడియంలో ఈ టెస్ట్ సిరీస్ జరగబోతోంది. అయితే ఈ టెస్ట్ సిరీస్ కోసం ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు కూడా క్వారంటైన్ లోకి వెళ్ళిపోయారు. క్వారంటైన్ నిబంధనలు పాటిస్తూ తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే.  అయితే ఐపీఎల్ టోర్నీ ముగియగానే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత జట్టు అక్కడ ఆస్ట్రేలియా జట్టుతో వరుసగా సిరీస్లు ఆడింది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వన్డే, టి20 సిరీస్ లలో ఒక సిరీస్ కైవసం చేసుకున్న భారత జట్టు ఆ తరువాత టెస్ట్ సిరీస్ లో వీరోచిత పోరాటం చేసి చారిత్రాత్మక విజయాన్ని నమోదుచేసింది అన్న విషయం తెలిసిందే.

 ఈ క్రమంలోనే భారత జట్టు ఆత్మవిశ్వాసం ఎంతగానో పెరిగిపోయింది.  ఇక ప్రస్తుతం జరగబోయే భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో భారత్ ఎలా రాణించ బోతుంది అనేదానిపై భారత ప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే అటు ఇరు దేశాలకు చెందిన మాజీ ఆటగాళ్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా  ఉంటూ భారత క్రికెట్ గురించి ఆటగాళ్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోతూ ఉంటాడు భారత మాజీ ఆటగాడు గౌతం గంభీర్.

 ఇక తాజాగా భారత్ ఇంగ్లాండ్ మధ్య ఫిబ్రవరి 5 నుంచి చెపాక్ స్టేడియం వేదికగా జరగబోయే టెస్ట్ సిరీస్ గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టుపై ఇంగ్లాండ్ జట్టు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా గెలవలేదు అంటూ చెప్పుకొచ్చాడు గౌతం గంభీర్. సొంతగడ్డపై భారత జట్టును గెలవాలి అంటే బలమైన స్పిన్  దళం ఉండాలని ఇంగ్లాండ్ జట్టు లో కొంతమంది అనుభవం గల ఆటగాళ్ళు ఉన్నప్పటికీ భారత బ్యాట్స్మెన్స్  వారిని ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొంటారు అంటూ చెప్పుకొచ్చాడు. టీమిండియా ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉండడం మరింత బలంగా మారిపోయింది అంటూ చెప్పుకొచ్చాడు గౌతమ్ గంభీర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: