ఆ బౌలర్ రికార్డులు.. టీమిండియాలో కంగారు పెంచుతున్నాయట..?
ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ ఇంగ్లాండ్ జట్టుకు చెందిన ఫాస్ట్ బౌలర్ ను తలుచుకుంటే టీమిండియా జట్టులో కంగారు పడుతుంది అని ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా టీం ఇండియా టాప్ ఆర్డర్ కి ఇంగ్లాండ్ సీనియర్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ తో ప్రమాదం పొంచి ఉందని మాజీ క్రికెటర్లు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు. 38 ఏళ్ల వయస్సులోనూ ఈ ఫాస్ట్ బౌలర్ అత్యుత్తమ ప్రదర్శన తో అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఇక ఇటీవల ఇంగ్లాండ్ జట్టు శ్రీలంక పర్యటన లో కూడా జేమ్స్ అండర్సన్ కీలకంగా వ్యవహరించాడు అన్న విషయం తెలిసిందే. జేమ్స్ అండర్సన్ వేసే బంతులకు లంకేయుల దగ్గర సమాధానం లేకుండా పోయింది.
ఒకవేళ టీమిండియా తో జరగబోయే టెస్ట్ సిరీస్లో కూడా అండర్సన్ ఊపు అందుకున్నాడు అంటే ఇక టీమిండియా టాప్ ఆర్డర్ కి ఎంతో కష్టంగా మారుతుంది అని అంటున్నారు. తన సుదీర్ఘ కెరీర్లో 157 మ్యాచ్లు ఆడిన జేమ్స్ అండర్సన్ 606 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 136 వికెట్లు భారత్ పై ఆడిన మ్యాచ్ లలోనే చేయడం గమనార్హం. మొత్తంగా కెరీర్లో 30 సార్లు 5 వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతేకాదు మూడు మ్యాచ్లలో పది వికెట్ల మార్కును కూడా అందుకున్నాడు. ఈ క్రమంలోనే ఈ సీనియర్ బౌలర్ రికార్డులు చూస్తూ ఉంటే భారత ఆటగాళ్లలో కంగారు పడుతుంది అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు