ఐపీఎల్ 2021 : వామ్మో ఇదేం క్రేజ్ గురూ.. ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారో తెలుసా..?

praveen
ప్రతి ఏడాది బిసిసీఐ  ఐపీఎల్ టోర్నీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ వస్తుంది అన్న విషయం తెలిసిందే. ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో ఐపీఎల్ టోర్నీ నిర్వహిస్తూ వస్తుంది బీసీసీఐ.  ఇక ప్రస్తుతం బిసిసిఐకి ప్రధాన ఆదాయం గా ఐపీఎల్ మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఐపీఎల్ టోర్నీ కేవలం బిసిసిఐకి కలిసి రావడమే కాదు  ఎంతో మంది యువ ఆటగాళ్లకు కూడా కలిసి వస్తుంది. 2008లో బిసిసిఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఐపీఎల్ టోర్నీ ప్రారంభించగా ఇప్పటివరకు 13 సీజన్ లు  జరిగాయి. అన్ని సీజన్ లు  కూడా అంతకంతకు క్రేజ్ సంపాదించుకున్నాయి అన్న విషయం తెలిసిందే.

 ఐపీఎల్ టోర్నీ పేరెత్తితే చాలు క్రికెట్ ప్రేక్షకులు అందరూ ఉర్రూతలూగి పోతూ ఉంటారు ఎందుకంటే అప్పటి వరకు ఓకే జట్టులో సహచరులుగా ఉన్న ఆటగాళ్లందరూ ప్రత్యర్థులుగా మారిపోవడం ఇక విదేశీ జట్లలో ప్రత్యర్థులుగా ఉన్న ఆటగాళ్లందరూ సహచరులుగా మారిపోయి ఒకరితో ఒకరు తలబడుతూ ఉండడం నేపథ్యంలో.. క్రికెట్ ప్రేక్షకులందరికీ క్రికెట్ మజా డబుల్ అవుతూ ఉంటుంది. అయితే అటు ఎంతో మంది యువ ఆటగాళ్లు కూడా ఐపీఎల్ కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఐపీఎల్లో స్థానం దక్కించుకొని బాగా రాణిస్తే అంతర్జాతీయ భారత జట్టు లో స్థానం తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుంది.

 ప్రస్తుతం భారత జట్టులో కొనసాగుతోన్న దాదాపు అందరు ఆటగాళ్లు ఐపీఎల్లో రాణించి భారత జట్టులో స్థానం సంపాదించుకున్న వారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇకపోతే ఐపీఎల్ కి ప్రతి ఏడాది ఎంత క్రేజ్ ఏర్పడుతుందో   ఇటీవలే దరఖాస్తు చేసుకున్న ఆటగాళ్ల జాబితా చెప్పకనే చెబుతుంది.  2021 ఐపీఎల్ కోసం కేవలం 61 మంది ఆటగాళ్లకు మాత్రం అవకాశం ఉండగా దీని కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది బీసీసీఐ. ఈ క్రమంలోనే ఏకంగా 10 97 మంది ఆటగాళ్లు దరఖాస్తు చేసుకున్నారు.  దీన్నిబట్టే ఐపీఎల్ క్రేజ్  ఎంత ఉంది అన్నది అర్ధమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: