ఆయనతో ఆడటానికి ఆతృతగా ఎదురు చూస్తున్నా..?

praveen
ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టుతో భారత జట్టు సొంత గడ్డపై హోరాహోరీగా తలబడుతూ  ఉంది అన్న విషయం తెలిసిందే. టెస్ట్ సిరీస్ లో  భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు విజయం సాధించగా.. రెండో టెస్టు మ్యాచ్ లో  భారత జట్టు ఘన విజయాన్ని అందుకుంది. కాగా ఇక టెస్ట్ సిరీస్ ముగియగానే మార్చి 12వ తేదీ నుంచి భారత జట్టు ఇంగ్లండ్ జట్టుతో టి20 సిరీస్ లో తలపడనుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ జట్టుతో తలపడనున్న  భారత జట్టును ఇటీవలే బీసీసీఐ ప్రకటించింది. ఎవరూ ఊహించని విధంగా బిసిసిఐ ఆటగాళ్లు ఇటీవలే సరికొత్త జట్టును ప్రకటించారు.



 గత ఏడాది ఐపిఎల్ లో అద్భుతంగా సత్తాచాటిన యువ ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తూ బిసిసిఐ సెలెక్టర్లు జట్టును ఎంపిక చేశారు. ఇకపోతే ఇటీవల బిసిసిఐ సెలెక్ట్ చేసిన జట్టు లో ఎంతో  మంది యువ  ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే తనకు భారత టీ 20 జట్టు లో స్థానం దక్కడంపై ఎంతో ఆనందం వ్యక్తం చేసాడు ఐపీఎల్ సూపర్ స్టార్ రాహుల్ తేవాటీయా. ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన రాహుల్ తేవాటీయా తనదైన బ్యాటింగ్ శైలి తో ఎంతలా ఆకట్టుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే ఇటీవల భారత జట్టులో తనకు స్థానం దక్కడం పై స్పందించిన రాహుల్ తేవాటీయా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఇప్పటివరకు భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రత్యర్థిగా ఆడానని కానీ ఇక నుంచి భారత జట్టులో  సహచరుడిగా ఆడబోతున్న అంటూ సంతోషం వ్యక్తం చేశాడు. క్రికెట్ దిగ్గజాలతో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకోవడానికి ఎంతగానో ఎదురు చూస్తున్నాను.. వారి నుంచి నేర్చుకోవడానికి ఇది తనకు ఒక గొప్ప అవకాశం లాంటిది అంటూ రాహుల్ తేవాటీయా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: