క్రికెట్ ఆడుతూ చనిపోయిన బ్యాట్స్‌మన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లోనే కుప్పకూలి..

yekalavya
ఇంటర్నెట్ డెస్క్: ఓ క్రికెటర్ క్రికెట్ ఆడుతూ మైదానంలోనే కుప్పకూలి మరణించాడు. అతడికి బంతి తగలలేదు. ఏమీ కాలేదు. నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లో నిలబడి ఉన్నట్లుండి కుప్పకూలి పడిపోయాడు. దీంతో అంపైర్‌తో సహా అంతా ఆందోళన చెంది అతడిని అక్కడి నుంచి తరలించారు. ఆంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే డాక్టర్లు అతడు మరణించినట్లు తేల్చడంతో వారంతా షాక్‌కు గురయ్యారు. మరణానికి గుండెపోటే కారణమని డాక్టర్లు తేల్చి చెప్పారు.
జున్నార్ మండలంలో ఓ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. మైదానంలో క్రికెట్ ఆడుతున్నారు. నాన్ స్ట్రైక్ వైపు నిలబడి బాబు నలవాడెగా అనే బ్యాట్స్‌మెన్ ఉన్నాడు. బౌలర్ బంతి వేయగా అవతలి వైపు బ్యాటింగ్ చేస్తున్న బ్యాట్స్‌మన్ భారీ షాట్ ఆడబోయాడు. మిస్ కావడంతో బంతి కీపర్ లోకి వెళ్లింది. నాన్ స్ట్రైక్ వైపున ఉన్న వ్యక్తి పరుగు తీసేందుకు ప్రయత్నించి..మరలా వెనక్కి వచ్చాడు. కీపర్ బంతి బౌలర్‌కు వేశాడు. మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. అయితే ఇంతలో నాన్ స్ట్రైక్ ఉన్న బ్యాట్స్‌మన్ అంపైర్‌తో మాట్లాడాడు.
ఉన్నట్లుండి బ్యాట్ పట్టుకుని మోకాళ్లపై కూర్చొన్నాడు. అలా కూర్చొన్న వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అసలు ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. అంపైర్ వెంటనే స్పందించి అతడిని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. అతడిని పరీక్షించిన డాక్టర్.. అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు. గుండెపోటు కారణంగా  అతడు చనిపోయినట్లు నిర్ధారించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. వీడియో చూసిన వారందరూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారున. అతడి ఆత్మకు శాంతి కలగాలని కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఆస్ట్రేలియాకు చెందిన ఫిలిప్ హ్యూజెస్ అనే యువ బ్యాట్స్‌మెన్ కొన్నేళ్ల క్రితం బంతి తగిలి మరణించిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనలు క్రికెట్‌లో అరుదుగా జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే పూణే మ్యాచ్‌లో కూడా బ్యాట్స్‌మన్ మరణించడం అందరికీ కలచివేస్తోంది. అప్పటివరకు ఎలాంటి గాయం కాకపోయినా హుషారుగా క్రికెట్ ఆడుతూనే ఉన్నట్లుండి గుండెపోటుతో మరణించడం అందరికీ ఆవేదనకు గురి చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: