ధోని సన్యాసి గెటప్ వెనుక.. అసలు కారణం ఏంటో తెలిసిపోయింది..?
ఎప్పుడూ మైదానంలో హాండ్సం గా కనిపించే మహేంద్రసింగ్ ధోని.. ఇక ఇటీవలే ఏకంగా బౌద్ధ సన్యాసి రూపంలో దుస్తులు ధరించి కనిపించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. గత కొన్నిరోజుల క్రితమే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని ఇక ఇప్పుడు ఇలా కనిపించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది అసలు ధోని ఇలాంటి గెటప్ లో ఎందుకు ఉన్నాడు. దీని వెనుక అసలు కారణం ఏంటి అన్నది అటు సోషల్ మీడియా వేదికగా వెతకని అభిమాని లేడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఇక ధోనీ ఇలా నయా లుక్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. అయితే ఈ నయా గెటప్ వెనుక అసలు కారణం ఏంటి అన్నది ఇటీవలే తెలిసొచ్చింది. పూర్తిగా గుండుతో బౌద్ధ సన్యాసిలా ధోనీ కనిపించడం వెనుక కారణం ఏంటి అంటే.. వివో 2021 ఐపీఎల్ సీజన్ కోసం స్టార్ స్పోర్ట్స్ ఒక యాడ్ రూపొందించింది. బౌద్ధ సన్యాసి రూపంలో ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ అతని శిష్యులకు ఐపీఎల్ లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ గురించి వివరిస్తూ ఉంటాడు. ఐదు టైటిల్ను కొట్టినప్పటికీ ఇంకా రోహిత్ శర్మ కసి తీరకుండానే ఉన్నాడని.. వివరించిన మహేంద్ర సింగ్ ధోనీ.. ఇక విరాట్ కోహ్లీ దూకుడుతనం గురించి కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు. ఈ యాడ్ కి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.