బూమ్రా భార్య గురించి... ఎవరికీ తెలియని నిజాలు ఇవే..?

praveen
ప్రస్తుతం భారత క్రికెట్ లో జస్ప్రిత్ బుమ్రా కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అనే విషయం తెలిసిందే .  ఒక సాదాసీదా బౌలర్గా టీమిండియా జట్టులో కి ఎంట్రీ ఇచ్చిన బుమ్రా  ఆ తర్వాత టీమిండియాలో కీలకమైన ఆటగాడిగా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ గా మారిపోయాడు జస్ప్రిత్ బూమ్రా. టీమిండియా విజయంలో ఎప్పుడు కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి  ముఖ్య పాత్రలు పోషిస్తూ ఉండేవాడు.  ప్రస్తుతం భారత క్రికెట్ జట్టులో ఏ ప్లేస్ గ్రేడ్  సొంతం చేసుకున్న ఏకైక బౌలర్ గా  జస్ప్రీత్ బుమ్రా రికార్డు సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే.


 అయితే జస్ప్రిత్ బూమ్రా గత కొన్ని రోజుల నుంచి క్రికెట్ కు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే  బుమ్రా  రెస్ట్ తీసుకుంటున్నాడు అని అందరూ అనుకున్నారు. కానీ జస్ ప్రీత్ బుమ్రా రెస్ట్ తీసుకోవడం కాదు ఏకంగా పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు  అన్నది గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.  అయితే ఇది నిజమా కాదా అన్న దానిపై మాత్రం కాస్త కన్ఫ్యూజన్ గా ఉంది. కానీ ఇటీవలే జస్ప్రిత్ బూమ్రా తన పెళ్లికి సంబంధించిన ఒక ఫోటో ని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో ఇక అభిమానులందరికీ క్లారిటీ వచ్చేసింది.  ఇటీవలేపలువురు బంధుమిత్రులు అతిధుల సమక్షంలో జస్ ప్రీత్ బుమ్రా స్టార్ స్పోర్ట్స్ లో టివి ప్రజెంటర్  గా చేస్తున్న సంజన గణేషన్ ను వివాహం చేసుకున్నాడు.


 ఇంకేముంది ఎవరైనా సెలబ్రిటీలు వివాహం చేసుకున్నారు అంటే చాలు ఇక వారు వివాహం చేసుకున్న మహిళ యొక్క వివరాలు ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది తెలుసుకునేందుకు సోషల్ మీడియా వేదికగా తెగ వెతుకుతూ ఉంటారు అభిమానులు. ఇక ఇప్పుడు బుమ్రా  భార్య గురించి తెలుసుకోవడానికి కూడా నెట్టింట్లో అభిమానులు తెగ సెర్చ్ చేస్తున్నారు. సంజన గణేషన్ గత ఏడాది జరిగిన ఉమెన్ వరల్డ్ కప్ కి ప్రజెంటర్  గా చేసింది. 1991 మే 6 వ తేదీన పూణే లో జన్మించిన సంజన గణేషన్ బీటెక్ వరకు చదువు పూర్తిచేసింది. ఇక మొదట మోడలింగ్ వృత్తి లోకి అడుగు పెట్టిన సంజన గణేషన్ ఇక ఆ తర్వాత ఏకంగా ఫెమినా  మిస్ ఇండియా పోటీల్లో ఫైనల్ వరకు వెళ్ళింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: