అతన్ని ఎలా తీసేస్తారు.. మీ నిర్ణయం కరెక్టే అనిపిస్తుందా : గంభీర్

praveen
ఈ మధ్య కాలంలో భారత క్రికెట్ లో ఏదో ఒక ఆటగాడు కి సంబంధించిన రగడ కొనసాగుతూనే ఉంది అనే విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో భారత డేర్ అండ్ డాషింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తీసుకుంటున్న నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. విరాట్ కోహ్లీ పలువురు ఆటగాళ్లపై వేటు వేసి జట్టు నుంచి తప్పించడం..  మరికొంత మంది ఆటగాళ్లను విశ్రాంతి పేరుతో జట్టుకు దూరం చేయడం లాంటి నిర్ణయాలు అటు హాట్  టాపిక్ గా మారి పోవడమె  కాదు కోహ్లీ నిర్ణయాలపై అటు  మాజీ క్రికెటర్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు.



 అదే సమయంలో కోహ్లీ  పేలవ ప్రదర్శన చేస్తూ తీవ్ర నిరాశ పరుస్తున్న  నేపథ్యంలో కోహ్లీ కెప్టెన్సీపై.. కోహ్లీ ఆట తీరుపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అయితే ఐపీఎల్లో అద్భుతంగా రాణించి ఎంతో ప్రశంసలు అందుకున్న సూర్యకుమార్ యాదవ్ ఇటీవలె.. టీమ్ ఇండియా ఇంగ్లాండ్ తో ఆడబోయే టి20 సిరీస్ కు ఎంపిక అయ్యాడు అనే విషయం తెలిసిందే. దీంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఇటీవలే టీ 20 జట్టు లో సెలెక్ట్ అయిన సూర్యకుమార్ యాదవ్ ను  తప్పించడంపై అటు మాజీ లు అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎప్పుడు భారత క్రికెట్ లో ఎవరు ఎలాంటి తప్పు చేసినా మండిపడే గౌతం గంబీర్  మరోసారి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.



 ఏడు నెలల్లో టి20 ప్రపంచకప్ ఉందని ఇలాంటి సమయంలో విరాట్ కోహ్లి ఇలాంటి నిర్ణయాలు తీసుకొని యువ ఆటగాళ్లకు జట్టులో నుంచి తప్పించడం సరైన నిర్ణయం కాదు అంటూ గౌతం గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యకుమార్ కు  యాదవ్ ఎలాంటి గాయాల బెడద వేధింపులూ లేవని  అంతేకాకుండా అతని బ్యాటింగ్ తీరు కూడా విరాట్ కోహ్లీ చూడలేదని.. అలాంటప్పుడు సూర్యకుమార్ యాదవ్ ను ఎలా పక్కన పెడతారు అంటూ ప్రశ్నించారు.  ఒకవేళ మిడిలార్డర్లో ఎవరైనా గాయ పడితే ఇక ఆటగాళ్లకి బ్యాకప్  ఉండాలి కదా అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: