ఐపీఎల్ 2021 : తెలుగు ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్లో మ్యాచ్ లు..?
దీంతో అటు తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఎంతగానో నిరాశలో మునిగిపోయారు. ఏకంగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాదులో ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించాలి అని ప్రత్యేకంగా రిక్వెస్ట్ పెట్టినప్పటికీ బీసీసీఐ మాత్రం హైదరాబాద్లో మా చిరు నిర్వహించేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో తెలుగు ప్రేక్షకులందరూ ఎంతో నిరాశ లో మునిగిపోగా ఇక ఇటీవల తెలుగు ప్రేక్షకులందరిలో కూడా కొత్త ఉత్సాహం నిండిపోతుంది. ఎందుకంటే ఐపీఎల్ హైదరాబాద్ లో నిర్వహించబోతున్నారా అంటే అవుననే సమాధానం ఎక్కువగా కనిపిస్తుంది.
ఎందుకంటే బిసిసిఐ ముందుగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించాలని భావించింది. కానీ ఇటీవలే వాంఖడే స్టేడియంలోని సిబ్బందిలో ఎనిమిది మందికి వైరస్ పాజిటివ్ గా తేలింది దీంతో ఏప్రిల్ 10వ తేదీన చెన్నై ఢిల్లీ మధ్య వాంఖడే స్టేడియంలో జరగబోయే మ్యాచ్ గురించి అటు బిసిసిఐ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. అదే సమయంలో అటు తెలంగాణ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్ స్పెషల్ రిక్వెస్ట్ చేయడం కూడా పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు వాంఖడే స్టేడియంలో వైరస్ కేసులు బయటపడడంతో ఇక హైదరాబాద్లో మ్యాచ్ లు నిర్వహించే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే తెలుగు క్రికెట్ ప్రేక్షకులందరికీ పండగే అని చెప్పాలి.