ఐపీఎల్ 2021 : అత్యధిక వేతనం తీసుకుంటున్న ఆల్ రౌండర్లు వీరే..?

praveen
బీసీసీఐ ప్రతి ఈ ఏడాది కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉంటుంది. అయితే 2008లో బిసిసిఐ ప్రారంభించిన ఐపీఎల్ అంతకంతకు క్రేజ్ సంపాదించుకుంటూ దూసుకుపోతుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద దేశవాళీ క్రికెట్ లీగ్  ఐపీఎల్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  అందుకే ప్రపంచ జట్ల లోని ఆటగాళ్లు అందరూ ఐపీఎల్లో ఆడటానికి ఎంతో ఆసక్తి చూపుతుంటారు. ఐపీఎల్లో ఆడటం వల్ల ఓ వైపు అనుభవానికి అనుభవం మరోవైపు భారీగా ఆదాయం కూడా సంపాదించవచ్చు అని భావిస్తూ ఉంటారు క్రికెట్ ఆటగాళ్లు  అయితే ఆటగాళ్లకు అత్యధిక వేతనాలు చెల్లించే దేశవాళీ క్రికెట్ లీగ్ కేవలం ఇండియన్ ప్రీమియర్ లీగ్ అని చెప్పాలి.



 అయితే ఒక ఆటగాడు తమ జట్టులోకి రావడం అవసరం అనుకుంటే ఆ ఆటగాడి కోసం ఎంతైనా చెల్లించడానికి వెనకకాడవు ప్రాంఛైజీలు అందుకే కొన్ని కొన్ని సార్లు కొంత మంది ఆటగాళ్ల వేతనం చూస్తే ఆశ్చర్యానికి గురికాక తప్పదు ముఖ్యంగా కొంతమంది ఆటగాళ్ళను కొన్ని జట్లు వదులుకుంటే అదే ఆటగాళ్లను భారీ ధర చెల్లించి కొనుగోలు చేస్తూ ఉంటాయి మిగతా జట్లు ఫిబ్రవరిలో జరిగిన వేలం పాటలో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు వదిలేసిన క్రిస్ మోరిస్ ను రాజస్థాన్ రాయల్స్ 16.25 కోట్లకు సొంతం చేసుకుంది.  అంతేకాదు ఇక గత ఏడాది పేలవ ప్రదర్శన చేశాడు అనే కారణంతో పంజాబ్ కింగ్స్ జట్టు మాక్స్వెల్ ను వదిలేయగా ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఏకంగా అతన్ని 14 కోట్లుకు పైగా చెల్లించి సొంతం చేసుకుంది.



 అయితే ఇప్పటి వరకు ఐపీఎల్ లో ఉన్న ఆల్రౌండర్లు అందరూ ఎంత మొత్తంలో పారితోషకాలు తీసుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. క్రిస్ మోరీస్ - రూ. 16.25 కోట్లు, కైల్ జేమిసన్ - రూ 15 కోట్లు, గ్లెన్ మ్యాక్స్‌వెల్ - రూ. 14.25 కోట్లు బెన్‌స్టోక్స్ - రూ.12.50 కోట్లు, హార్దిక్ పాండ్యా - రూ. 11 కోట్లు క్రిష్ణప్ప గౌతమ్ - రూ. 9.25 కోట్లు, కృనాల్ పాండ్యా - రూ. 8.8 కోట్లు, ఆండ్రీ రస్సెల్ - రూ. 8.50 కోట్లు, రవిచంద్రన్ అశ్విన్ - రూ. 7.60 కోట్లు, రవీంద్ర జడేజా - రూ. 7 కోట్లు, మొయిన్ అలీ - రూ. 7 కోట్లు, డ్వేన్ బ్రావో - రూ. 6.40 కోట్లు, సామ్ కర్రన్ - రూ. 5.5 కోట్లు, కిరాన్ పొలార్డ్ - రూ. 5.4 కోట్లు, టామ్ కర్రన్ - రూ. 5.20 కోట్లు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: