పెళ్లి కాకుండానే తండ్రయిన మరో స్టార్ క్రికెటర్?
ఇక ఇటీవలే మరో స్టార్ క్రికెటర్ కూడా పెళ్లి కాకుండానే తండ్రి అయినట్లు తెలుస్తుంది. ఆస్ట్రేలియా బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ త్వరలో తండ్రి కాబోతున్నాడట. ప్రస్తుతం ఆస్ట్రేలియన్ స్టార్ ప్లేయర్ ప్యాట్ కమ్మిన్స్ ప్రేయసి బెకీ బోస్టన్ గర్భంతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మే నెలలో ఆమె ప్రసవం కానుందట. ఇక ఈ విషయాన్ని ఇటీవలే కోల్‌కతా నైట్‌రైడర్స్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో తెలిపింది. మే నెలలో ప్యాట్ కమ్మిన్స్ ప్రేయసి డెలివరీ కానుందని ఇదొక ఫెంటాస్టిక్ వార్త అంటూ చెప్పుకొచ్చింది కేకేఆర్ ఫ్రాంచైజీ . ఈ క్రమంలోనే ఈ వార్త కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్యాట్ కమ్మిన్స్‌కు వార్నర్ తో పాటు మిగతా క్రికెటర్లు కూడా విషెస్ చెబుతున్నారు. ఇలా పెళ్లి కాకుండానే తండ్రి కాబోతున్న క్రికెటర్ల జాబితాలో చేరిపోయారు ప్యాట్ కమ్మిన్స్.
ఇకపోతే గత ఏడాది తన ప్రేయసి తో నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు అని అభిమానులు భావించారు. కానీ అంతలోనే ఊహించని శుభవార్త అభిమానులకు అందించాడు ఈ స్టార్ క్రికెటర్. ఏదేమైనా ఈ మధ్య కాలంలో మాత్రం ఇలా పెళ్ళి కాకుండానే తండ్రవుతున్న క్రికెటర్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇలాంటి వార్తలతో అటు అభిమానులు అందరూ సర్ప్రైస్ అవుతున్నారు అని చెప్పాలి.