T-20 వరల్డ్ కప్ జరపడం కష్టమే: బిసిసిఐ

Purushottham Vinay
కరోనా వైరస్ సెకండ్ వేవ్ దేశాన్ని దారుణంగానే దెబ్బ తీస్తుందనే చెప్పాలి.ఆ దెబ్బ ఎంత నొప్పిగా ఉందో ఒక్కో ఫలితం బయటపడుతుంటే అర్థం అవుతుంది. కరోనా సెకండ్ వేవ్ విజరుంభిస్తూ విలయతాండవం చేస్తున్నా సరే ఐపీఎల్ ఎట్టి పరిస్ధితుల్లో కంటిన్యూ చెయ్యాలని పట్టుబట్టి మరీ బీసీసీఐ ముందుకెళ్లడం జరిగింది.మైదానంలో ప్రేక్షకులు లేకుండానే స్టార్ట్ చేసింది. కాని టోర్నమెంట్ మధ్యలోనే ప్లేయర్స్ కి కరోనా సోకడంతో ఖంగారు పడింది. ఇక చేసేది లేక ఇష్టం లేకున్నా తప్పనిసరి పరిస్ధితుల్లో ఐపీఎల్ ను ఆపేయడం జరిగింది.ఇప్పుడు ఐపీఎల్ ప్లాట్ ఫామ్ దుబాయ్ కి చేంజ్ అయ్యింది. అలాగే కొత్త షెడ్యూల్ కూడా రాబోతున్నట్లు తెలుస్తుంది. టీ ట్వంటీ వరల్డ్ కప్ టోర్నమెంట్ ఈసారి ఇండియాలోనే లోనే జరపాల్సి ఉంది. కాని కరోనా మహమ్మారి దెబ్బకు అతలాతకుతలమైన ఇండియాలో ఆ టోర్నమెంట్ కూడా జరపలేమని ఈసారి ఐపీఎల్ లా కాకుండా ప్రాక్టికల్ గా ఆలోచించి డెసిషన్ తీసుకోవడం జరిగింది బీసీసీఐ.


నిజం చెప్పాలంటే టీ-20 ప్రపంచకప్‌ జరిపేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై తమకు క్లారిటీ ఇవ్వాలంటూ బీసీసీఐకి ఐసీసీ విన్నవించుకోవడం జరిగింది.అంతేగాక జూన్‌ 28 దాకా ఏదో ఒకటి తేల్చి చెప్పాలంటూ గడువు కూడా విధించింది.అందుకు బీసీసీఐ మాత్రం గడువుకు చాలా మందే తాము జరపలేమని చెప్పడం జరిగింది. ఈ మెగా టోర్నమెంట్‌ ఈ సంవత్సరం అక్టోబర్‌-నవంబర్‌ నెలల్లో జరగాలి.. ఈ కరోనా పరిస్థితుల్లో ఆ టోర్నమెంట్‌ను జరపడం తలకు మించిన భారమేనని తెలుస్తుంది. ఎందుకంటే ఎనిమిది జట్లు ఉన్న ఐపీఎల్‌ టోర్నమెంట్‌నే జరుపలేక అల్లాడింది భారత క్రికెట్‌ కంట్రోల్‌బోర్డు.. ఇక ఇప్పుడు ఏకంగా 16 జట్లు పాల్గొనే టీ-20 వరల్డ్‌కప్‌ను ఎలా జరుపగలదు? అయితే టీ-20 వరల్డ్‌కప్‌పై బీసీసీఐ అధికారికంగా ఓ క్లారిటీ ఇవ్వకపోయినా కాని వెళ్లిపోవడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.


ఇక ప్రస్తుతం ఐసీసీ దగ్గరున్న సొల్యూషన్ ఆ టోర్నమెంట్‌ను యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో జరపడం మాత్రమే.యుఏఇ తో పాటుగా కొన్ని మ్యాచ్‌లను ఒమన్‌లో కూడా జరపాలని అనుకుంటోంది.దీనికి ఇండియా కూడా ఓకే చెప్పవచ్చు. ఆతిథ్యహక్కులు తమ దగ్గరే ఉంచుకుంటూ యుఏఇ, ఒమన్‌ దేశాలలో ప్రపంచకప్‌ను జరిపిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఐసీసీకి బీసీసీఐ చెప్పడం జరిగిందట.మరో వైపు కరోనా థర్డ్‌ వేవ్‌ కూడా భయపెడుతుంది.ఇలాంటి సిట్యుయేషన్ లో ఇక్కడ టీ-20 వరల్డ్‌ కప్‌ను జరపడమన్నది దాదాపుగా సాధ్యం కాదనే చెప్పాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో అంచనా వెయ్యడం చాలా కష్టం అని తెలుస్తుంది. కరోనా కేసుల సంఖ్య కొంచెం తగ్గినప్పటికీ కరోనా పూర్తిగా కంట్రోల్‌ అవ్వలేదు. ఇప్పుడు అదుపులోకి రావచ్చు కానీ రేపొద్దున థర్డ్‌ వేవ్‌ అంటూ వస్తే ఎలా అనే విషయం భయం కలిగిస్తోందట.వరల్డ్ కప్‌ లాంటి పెద్ద టోర్నమెంట్లను జరిపేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. మొన్న ఐపీఎల్‌లో బయోబబుల్‌ ఎలా పని చేసిందో తెలిసిన విషయమే.. అందుకే కరోనా నియమాలను తప్పకుండా అమలు చేసే యూఏఈ అయితేనే మంచిదని ఐసీసీ కూడా ఆలోచిస్తుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: