WTC ఫైనల్ ఒక సాదాసీదా మ్యాచ్.. కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు?

praveen
అబ్బా..  మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతున్నా.. మ్యాచ్ ఎలా సాగుతుందో అనే ఉత్కంఠ లో నరాలు తెగేలాగా ఉన్నాయి..  ప్రపంచం మొత్తం ఇంత ఉత్కంఠగా ఎదురు చూస్తుంటే.. ఇక మైదానంలో ఆడబోయే ఆటగాళ్లు పరిస్థితి ఎలా ఉందో. ఇంతకీ నేను చెప్పేది దేని గురించి అనుకుంటున్నారా..  ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది.. అవును.. నేను  చెప్పేది మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ గురించి.  ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ ఈ మ్యాచ్ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.



 అగ్రిసీవ్ కెప్టెన్ తో.. అందరికీ హాట్ ఫేవరేట్ గా ఉన్న టీమ్ ఇండియా.. ఊహకందని వ్యూహాలతో.. జట్టుకి ఏ క్షణంలోనైనా విజయాన్ని అందించే కెప్టెన్ ఉన్న న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ అనేసరికి  ప్రతి క్రికెట్ ప్రేక్షకుడిలో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది.  ఇక వరల్డ్ బెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో ఎవరు ఎలా రాణించ బోతున్నారు.. ఏ జట్టు ఎలా పైచేయి సాధించ బోతుంది అన్నది చూడటానికి అందరూ  ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే మరికొన్ని గంటల్లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది అనుకుంటున్న తరుణంలో..  ఈ మ్యాచ్ పై కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.



 కేవలం ఒక్క మ్యాచ్ తమ జట్టు ప్రదర్శనను నిర్ణయించలేదు అంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు. అది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ అయిన కూడా అంతే అంటూ తెలిపాడు విరాట్ కోహ్లీ. తమ జట్టుకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఒక సాధారణ మ్యాచ్ తో సమానం అంటూ తెలిపాడు  ఈ మ్యాచ్లో గెలిచినా ఓడినా తమ క్రికెట్ మాత్రం ఆగదని తెలిపాడు. బ్యాట్ కి బాల్ కి మధ్య జరుగుతున్న సమరమే మ్యాచ్ అంటూ చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ. మరోవైపు రెండేళ్లుగా అద్భుతమైన ఫామ్ నూ కొనసాగించిన తమ జట్టు వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరుకుంది అని ఇక ఫైనల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేసాడు న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: