దిగ్గజ స్ప్రింటర్‌ మృతి పట్ల ప్రముఖులు సంతాపం..!

Suma Kallamadi
భారతదేశ క్రీడా రంగంలో ఎన్నో అద్భుతమైన విజయాలను సాధించిన గొప్ప అథ్లెట్ మిల్కా సింగ్ శుక్రవారం అర్ధరాత్రి 11.30 గంటల ప్రాంతంలో తన తుది శ్వాస విడిచారు. మే నెలలో కరోనా వైరస్ బారిన పడిన ఈ దిగ్గజ స్ప్రింటర్ యొక్క ఆరోగ్యం గత కొద్ది రోజులుగా కుదుటపడుతూ వచ్చింది. బుధవారం రోజు ఆయనకు కరోనా నెగిటివ్ గా కూడా తేలింది. దీంతో మిల్కా సింగ్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని భావించి అతన్ని సాధారణ వార్డ్ కి తరలించారు. కానీ శుక్రవారం ఆయనకు తీవ్ర జ్వరం వచ్చింది. ఆక్సిజన్‌ స్థాయి కూడా ఒకేసారి పడిపోవడంతో అతన్ని తిరిగి ఐసీయూకి తరలించారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన ఆరోగ్య పరిస్థితి బాధా క్షీణించడంతో మరణించారు. ఇదిలా ఉండగా జూన్ 13వ తేదీన కరోనాతో బాధపడుతూ మిల్కా భార్య నిర్మల్‌ కౌర్‌ (85) కన్నుమూశారు.

వేగంగా పరిగెత్తే తన అద్భుతమైన ప్రతిభతో ప్లయింగ్‌ సిఖ్‌గా ప్రసిద్ధి చెందిన మిల్కా.. 1958 కామన్వెల్త్‌ క్రీడల్లో పసిడి పతకం గెలిచారు. ఆసియా అథ్లెటిక్స్‌లో నాలుగు పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. ఇక.. 1960 రోమ్‌ ఒలింపిక్స్‌లో 400 మీటర్ల పరుగులో ఆఖరి క్షణాన బ్రాంజ్ మెడల్ కోల్పోయారు. ఈ పరుగు పందెం ఫైనల్లో ఆయన నాలుగో స్థానం దక్కించుకున్నారు. 1956, 1964 జరిగిన ఒలింపిక్స్‌ పోటీల్లో కూడా ఆయన పాల్గొన్నారు. మిల్కా సింగ్ 1959లో పద్మశ్రీ అవార్డు కూడా పొందారు. అయితే భారతదేశానికి ఎన్నో పేరు ప్రఖ్యాతులు, అవార్డులు తెచ్చిపెట్టిన క్రీడాకారుడు మిల్కా సింగ్ చనిపోవడంతో యావత్ భారతదేశం శోకసంద్రంలో మునిగి తేలుతోంది.
ప్రస్తుతం సోషల్ మాధ్యమాలలో ప్రముఖులందరూ ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు

"శ్రీ మిల్కా సింగ్ జీ కేవలం క్రీడా తార మాత్రమే కాదు, ఆయన తన అంకితభావం, స్థితిస్థాపకత లతో మిలియన్ల మంది భారతీయులకు స్ఫూర్తినిచ్చారు. ఆయన కుటుంబానికి, స్నేహితులకు నా సంతాపం. భారతదేశం ప్లయింగ్‌ సిఖ్‌ని గుర్తు చేసుకుంటుంది," రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు.

"మిల్కా సింగ్ అంటే మాకు ఎంత ఇష్టమో నా తరం ఎలా వివరించగలదు? అతను కేవలం అథ్లెట్ కాదు. వలసవాదం తర్వాత అభద్రతాభావాలతో బాధపడుతున్న మనందరం అత్యుత్తమంగా మారగలమని చెప్పడానికి మిల్కా సింగ్ ఒక సంకేతంగా నిలుస్తున్నారు మాకు ఆ విశ్వాసం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఓం శాంతి," అని ఆనంద్ మహేంద్ర ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు.



"ఒక శకం ముగిసింది. చాలా గందరగోళాన్ని ఎదుర్కొంటున్న దేశం యొక్క ఆశలను ఆకాంక్షలను మిల్ఖాజీ పెంచారు. ఆయన అన్ని తరాల క్రీడాకారులను ప్రేరేపించారు. ఇప్పటికీ ప్రేరేపిస్తూనే ఉన్నారు. ఓ సందర్భంగా అతనితో మాట్లాడటం నా అదృష్టం. అతని ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాను" అని అశ్విని నాచప్ప ట్వీట్ చేశారు.
"ఫ్లయింగ్ సిక్కు మిల్కా సింగ్ జీ ప్రపంచానికి వీడ్కోలు చెప్పడంతో ఒక శకం ముగిసింది. ఒక దిగ్గజ స్ప్రింటర్.. అతను అంకితభావం, వినయం & జాతీయ కీర్తి యొక్క సారాంశం. మిల్కా సింగ్ జీ యొక్క స్ఫూర్తిదాయకమైన ప్రయాణం & భారతీయ క్రీడలకు చేసిన సహకారం ఎప్పటికీ గుర్తుంచుకోబడుతుంది. ఓం శాంతి," అని స్మృతి ఇరానీ ట్వీట్ చేశారు.

"మిల్కా సింగ్ జీ మరణం గురించి విన్నప్పుడు బాధగా అనిపించింది. ఇది ఒక శకం యొక్క ముగింపును సూచిస్తుంది. భారతదేశం & పంజాబ్ ఈ రోజు పేదలుగా ఉన్నాయి. ఆయన కుటుంబానికి & మిలియన్ల మంది అభిమానులకు నా సంతాపం. ఫ్లయింగ్ సిక్కు యొక్క విజయాల రాబోయే తరాలకు ప్రతిధ్వనిస్తాయి." అని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ పేర్కొన్నారు.

"రెస్ట్ ఇన్ పీస్ ‘ఫ్లయింగ్ సిక్కు’ మిల్కా సింగ్ జి. మీ మరణం ఈ రోజు ప్రతి భారతీయుడి హృదయంలో తీవ్ర శూన్యతను మిగిల్చింది, కాని మీరు రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తూ ఉంటారు", అని సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: