శుభమన్ గిల్ సెంచరీ చేస్తే.. ఆ అమ్మాయి ఫుల్ హ్యాపీ?
అయితే రోహిత్ శర్మకు ఇప్పటివరకు పలు ఐసీసీ ఈవెంట్ లో ఆడిన అనుభవం ఉన్నప్పటికీ.. శుబ్ మన్ గిల్ కి మాత్రం ఇప్పటివరకు ఏ ఒక్క ఐసిసి ఈవెంట్లో ఆడలేదు. దీంతో శుబ్ మన్ గిల్ వత్తిడితో ఉంటాడు అని అనుకున్నారు అందరు. కానీ ఊహించని విధంగా అద్భుతంగా రాణిస్తున్నాడు శుబ్ మన్ గిల్. బ్యాటింగ్లో ఎక్కడ తడబాటు కనిపించడం లేదు. ఒకరకంగా చెప్పాలి అంటే అటు న్యూజిలాండ్ బౌలర్లను ఒక ఆట ఆడుకుంటున్నాడు అని చెప్పాలి. అద్భుతమైన బాటిల్ తీరుతో వరుసగా సిక్సర్లు ఫోర్లు కొడుతున్నాడు. ఇక ఇదే ఊపు కొనసాగితే యువ ఆటగాడు సెంచరీ చేసే అవకాశం కూడా లేకపోలేదు.
అదే శుబ్ మన్ గిల్ సెంచరీ చేయాలని అటు ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం ఫ్యాన్స్ కంటే మరింత ఆతృతగా యువ ఆటగాడి సెంచరీ కోసం ఎదురు చూస్తుంది. ఆ వ్యక్తి ఎవరో కాదు సారా టెండూల్కర్. గత కొంత కాలం నుంచి శుబ్ మన్ గిల్ సారా టెండూల్కర్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.సోషల్ మీడియా లో ఒకరి పోస్టులను ఒకరు ఎక్కువగా లైక్ చేసుకోవడం కూడా దీనికి కారణం. ఈ నేపథ్యంలో ఇక ఇప్పుడు ఫాన్స్ కంటే ఎక్కువగా శుబ్ మన్ గిల్ సెంచరీ చేయాలని అటు సారా టెండూల్కర్ ఎక్కువగా కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గిల్ దూకుడు చూస్తే సెంచరీ చేసి సార టెండూల్కర్ కోరిక తీర్చే లాగే కనిపిస్తున్నాడు.