నేచర్ లవర్ గా ధోనీ!
అంతర్జాతీ
దీంతో మహీ తాజాగా అభిమానులకు సోషల్ మీడియా ద్వారా ఒక విజ్ఞప్తి చేశాడు. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి సిమ్లాలో పర్యటిస్తున్న ఈ వెటరన్ వికెట్‌కీపర్ అక్కడి మీనా బాగ్ విల్లాలో బస చేస్తున్నాడు. శుక్రవారం ఆ విల్లా బయట ఉన్న చెక్క బోర్డుపై ‘మొక్కలు నాటండి.. అడువులను కాపాడండి’ అని తన స్వహస్తాలతో రాసి దాని కింద ధోనీ సంతకం చేశాడు. ఆ బోర్డు పక్కన నిలబడి ధోనీ దిగిన ఫొటోను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అధికారిక ఇన్ స్టా, ట్విట్టర్ ఖాతాల్లో పోస్ట్ చేసింది. తమ సారథి అభిమానుల మదిలో ఎల్లప్పుడూ మంచి ఆలోచనలను నాటుతాడంటూ ఆ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చి సీఎస్కే షేర్ చేసింది. దీనికి ధోనీ అభిమానుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఇన్ స్టాలో అయితే, ఈ పోస్ట్‌కు ఇప్పటికే దాదాపు 6.5 లక్షలకు పైబడి లైకులు రావడం విశేషం. ఇక, దుబాయ్‌లో జరిగిన గత సీజన్ ఐపీఎల్లో ఎన్నడూ లేని విధంగా పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన సీఎస్కే.. ఈ ఏడాది ఐపీఎల్లో తిరిగి పుంజుకుంది. కొవిడ్‌తో వాయిదా పడిన తాజా ఐపీఎల్ నిలిచిపోయే సమయానికి చెన్నై పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.ల