మరో యువరాజ్ అనుకున్నారు.. కానీ కనిపించకుండా పోయాడు?
ఇక ఆ తర్వాత కుటుంబ సమస్యల కారణంగా 14 ఏళ్లకే శివం దుబే క్రికెట్ కి గుడ్ బై చెప్పాడు. ఆ తర్వాత చదువుకుంటూన్న సమయంలో క్రికెట్ మీద ఆశ చావలేదు. తన ట్రైనింగ్ కి ఎవరైనా సహాయం చేస్తారేమో అని ఎదురు చూడటం మొదలుపెట్టాడు. ఇక ఆ తర్వాత చిన్నచిన్న టోర్నమెంట్ నుంచి వేగంగా ఐపీఎల్లో రాణించి భారత జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. ఇక భారత జట్టులోకి వచ్చిన నాటి నుంచి ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకోలేదు. పవర్ హీటింగ్ తో అటు మరో అద్భుతమైన క్రికెటర్ వచ్చేసాడు అని అనుకున్నారు అభిమానులు. కానీ ఆ తర్వాత మాత్రం అదే ఫామ్ కొనసాగించలేకపోయాడు శివమ్ దూబే.
చివరికి పేలవ ప్రదర్శనతో జట్టులో స్థానం కోల్పోయాడు. భారత జాతీయ జట్టులోకి ఎంతో నమ్మకంగా తీసుకుంటే ఇక నమ్మకాన్ని వమ్ము చేశాడు. కేవలం ఒకటి రెండు మ్యాచ్ లలో మాత్రమే మెరుపులు మెరిపించి.. ఆ తర్వాత మాత్రం పేలవ ప్రదర్శన చేశాడు. భారీ అంచనాలతో జట్టులోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ చివరికి ఫామ్ కోల్పోయి పూర్తిగా కెరీర్ని నాశనం చేసుకున్నాడు. ఇక శివం దూబే జట్టులోకి వచ్చిన సమయంలో అతని హిట్టింగ్ చూసి మరో యువరాజు లాంటి ఆటగాడు దొరికాడు అని అనుకున్నారు అందరు. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ జట్టులో స్థానం కోల్పోయాడు. మరోసారి జట్టులో అవకాశం దక్కించుకోవడం కూడా శివం దూబే కష్టమే అన్నది అర్ధమవుతుంది.