ఫ్యాన్స్ కి కోహ్లీ చాలెంజ్.. భార్యతో అలా చేస్తూ?
ఇక వీరిద్దరూ లాక్డౌన్ సమయంలో ఒకరినొకరు కామెంట్స్ చేసుకుంటూ సరదాగా గడిపిన వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి హల్ చల్ చేశారు. ఇక వీరిద్దరికీ మంచి క్రేజ్ ఉండటంతో వీరి పెట్టిన పోస్టులు కూడా వేగంగా వైరల్ గా మారిపోతూ ఉంటాయి. అంతేకాదు వీరి పోస్టుల గురించి అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతకీ ఇటీవలే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమానులకు ఇచ్చిన చాలెంజ్ ఏంటి అని అంటారా. చేతి మునివేళ్ళపై బ్యాట్ ని కొంత సేపటి వరకు బాలన్స్ చేయాలి . అయితే కోహ్లీ ఇలా బ్యాట్ బాలన్స్ చేయగా ఇక పక్కనే అటు కోహ్లీ విసిరిన చాలెంజ్ స్వీకరించి కోహ్లీ సతీమణి అనుష్క శర్మ కూడా తన చేతి మునివేళ్ళపై బ్యాట్ బాలన్స్ చేసి చాలెంజ్ పూర్తి చేసింది. ఇక అభిమానులు అందరూ కూడా ఈ చాలన్ స్వీకరించాలని చెబుతున్నాడు కోహ్లీ.
ఇటీవలే ఓ వీడియో షేరింగ్ యాప్ తో ఒప్పందం కుదుర్చుకున్న విరాట్ కోహ్లీ దంపతులు ఇక సోషల్ మీడియాలో షార్ట్ వీడియోలలో తెగ అలరిస్తున్నారు. కాగా ప్రస్తుతం టీమిండియా జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. టెస్టు సిరీస్కు ముందు దొరికిన విరామాన్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు క్రికెటర్లు. ఎలాంటి ఒత్తిడి ఉండకుండా ఇక సరదా సరదాగా గడుపుతున్నారు. ఇకపోతే అటు ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతుంది కోహ్లీసేన. ఇక మరోవైపు యంగ్ టీమ్ ఇండియా జట్టు ఇటీవల శ్రీలంక పర్యటనకు బయలుదేరింది. అక్కడ శిఖర్ ధావన్ కెప్టెన్సీలో యంగ్ టీమ్ ఇండియా జట్టు వన్డే, టి20 మ్యాచ్ లు ఆడనుంది.