భార్యకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ధోనీ....?

praveen
ఇండియాలో క్రికెట్ అంటే తెలిసిన వారికి తప్పకుండా తెలిసిన వ్యక్తి మహేంద్ర సింగ్ ధోని. ఇండియా వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా తన ఆట తీరుతో వేలాది మంది అభిమానుల్ని సంపాధించుకున్నాడీ క్రికెటర్. మెరుపు వేగంతో వికెట్లను గిరాటేసే మహేంద్రుడు అంతే మెరుపు వేగంతో అంతర్జాతీయ క్రికెట్ లో ఓ వెలుగు వెలుగుతూ... సెలబ్రెటీలా మారిపోయాడు. అతడి కెప్టెన్సీ గురించి చెప్పుకోవాలంటే మాటలు చాలవు.


ఎంతటి ప్రత్యర్థినయినా తన పదునైన వ్యూహాలతో బోల్తా కొట్టించగలడు ఈ మహేంధ్రుడు. ఇండియాలో అమ్మాయిలకు కలల రాకుమారుడిగా ఉన్న ఈ జులపాల జుట్టు మహేంద్రుడు 2010లో వివాహం చేసుకుని ఓ ఇంటి వాడయ్యాడు. ఎవరికీ తెలియకుండా మూడేళ్ల పాటు ప్రేమించి.. రెండేళ్లు డేటింగ్ కూడా చేసిన తన చిన్న నాటి స్నేహితురాలు సాక్షిని ఆయన 2010లో వివాహం చేసుకున్నాడు.


నేటితో మహేంద్రుడి వివాహం జరిగి 11 ఏళ్లవుతుంది. ఈ 11 ఏళ్ల దాంపత్య జీవితంలో ఇద్దరు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ సంతోషంగా జీవించారు. వీరి 11 సంవత్సరాల దాంపత్య జీవితానికి గుర్తుగా జీవా అనే అమ్మాయి కూడా ఉంది. ధోనికి జీవా అంటే ప్రాణం అనే విషయం వేరే చెప్పక్కర్లేదు. ఇలా తన వివాహం జరిగి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మహేంద్రుడు తన భార్య సాక్షికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడట. అదేంటంటే మహేంద్రుడు తన భార్య కోసం ఓ వింటేజ్ కారును కొనుగోలు చేశాడు. తెలుపు, లేత నీలం రంగు కలగలిసి ఉన్న ఈ కారును ధోని తనకు  11 సంవత్సరాల యానివర్సరీ కానుకగా ఇచ్చాడని మద్దు గుమ్మ సాక్షి తెలిపింది. తను ఇన్ స్టాగ్రామ్ లో ఈ కారుతో దిగిన ఒక ఫొటోను కూడా పోస్ట్ చేసింది. మరో విషయం కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనికి కార్లు, బైకులంటే విపరీతమైన పిచ్చి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: