అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి.. ఆడియన్స్ కి షాక్?
ఇక టోక్యో ఒలంపిక్స్ లో ఆటగాళ్లు అర్హత సాధించేందుకు నిర్వహించే టెస్టులను కూడా నిర్వహించి ఆటగాళ్లను సెలెక్ట్ చేసింది. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం తగ్గడంతో ఇక 50% సామర్థ్యంతో ప్రేక్షకులను అనుమతించాలి అని అటు జపాన్ ప్రభుత్వం భావించింది. దీంతో అటు ప్రేక్షకులు అందరూ ఎంతగానో సంబర పడిపోయారు. టోక్యో ఒలంపిక్స్ ని ప్రత్యక్షంగా వీక్షించవచ్చు అని సంతోషపడ్డారు. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇక జపాన్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
దీంతో ఇటీవల జపాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అటు ఆడియన్స్ అందరికీ షాక్ తగిలనున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ కారణంగా అనేక ఆంక్షల మధ్య ఒలింపిక్స్ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఒలంపిక్స్ సందర్భంగా జపాన్ వ్యాప్తంగా కరోనా ఎమర్జెన్సీ విధించాలని అక్కడి ప్రభుత్వం భావిస్తోందట. అయితే లాక్ డౌన్ కంటే కాస్త తక్కువ నిబంధనలను విధించాలని జపాన్ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒలంపిక్స్ ప్రారంభమయ్యే ఈ నెల 23 నుంచి ఆగస్టు 22 వరకు ఈ ఆంక్షలను జపాన్ ప్రభుత్వం అమలులోకి తెచ్చే అవకాశం ఉంది అని అక్కడి మీడియా సంస్థలు చెబుతున్నాయి. దీంతో దాదాపు ప్రేక్షకులు లేకుండా ఒలంపిక్స్ నిర్వహించడం కన్ఫార్మ్ అయిపోయినట్లే అంటున్నారు విశ్లేషకులు.