మళ్లీ కిచెన్ లో చేరిన సచిన్.. ఏం చేసాడో చూడండి?

praveen
భారత క్రికెట్లో సచిన్ టెండూల్కర్ కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. అతి పిన్నవయసులో భారత అంతర్జాతీయ క్రికెట్ లో ఎంట్రీ ఇచ్చిన  సచిన్ టెండూల్కర్ దాదాపు ఇరవై రెండేళ్ల పాటు ఇండియన్ క్రికెట్ లో  సేవలందించాడు.  ఇక భారత జట్టుకు ఎన్నో మరపురాని విజయా లను అందించాడు  ఏ ఆటగాడికి సాధ్యంకాని రికార్డులను నెలకొల్పాడు సచిన్ టెండుల్కర్. ఇక ప్రస్తుతం భారత క్రికెట్లో క్రికెట్ దేవుడిగా కొనసాగుతున్నాడు.  ప్రేక్షకులు సచిన్ టెండూల్కర్ను ప్రేమగా మాస్టర్ బ్లాస్టర్ అని పిలుచుకుంటూ ఉంటారు.  అయితే రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ సచిన్ టెండూల్కర్ క్రేజ్ మాత్రం ఇప్పటికీ ఎక్కడా తగ్గలేదు. ఎన్నో వాణిజ్య ప్రకటనల్లో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు.


 ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులందరికీ ఎంతో దగ్గర గానే ఉంటాడు సచిన్ టెండూల్కర్. ముఖ్యంగా సచిన్ టెండూల్కర్ అప్పుడప్పుడు కొన్ని వెరైటీ వంటలు చేస్తూ నెటిజన్లను ఎంతగానో అలరిస్తూ ఉంటాడు.  ఇప్పుడు వరకు ఇలా సచిన్ టెండూల్కర్ వంటలు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో ఎన్నోసార్లు వైరల్ గా మారిపోయాయి.  ఇక ఇప్పుడు మరో సారి సచిన్ టెండూల్కర్ కిచెన్లో దూరి అదిరిపోయే వంట చేసి అభిమానులందరినీ సర్ప్రైజ్ చేశాడు.  అంతేకాదు సరికొత్త లుక్ లో కనిపించిన సచిన్ టెండూల్కర్ ప్రస్తుతం ఈ వీడియోలో అలరిస్తూ ఉన్నాడు. ఇటీవలే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది.


 ఎప్పుడు వంట గదిలో తన ఆత్మీయుల కోసం వంట చేసే సచిన్ మరోసారి కిచెన్లో దూరిపోయాడు. తమ ఆత్మీయుల కోసం మరోసారి చెఫ్ అవతారమెత్తాడు. తాను వండేది ఎవరికీ తెలియదని.. తనకు కూడా అది ఏంటో తెలియదు అంటూ సచిన్ సరదాగా కామెంటరీ కూడా ఇస్తూ వంటకం రెడీ చేశాడు. అంతేకాదు ఇక ఈ వంటకాన్ని చేస్తూనే తన క్రికెట్ టెక్నిక్ ని కూడా వంటకంలో ఉపయోగించాను అంటూ కామెంట్రీ ఇచ్చాడు సచిన్ టెండూల్కర్. అయితే తాను తయారుచేస్తున్న వంటకం పేరేంటి ఇక ఆ వంటకాన్ని ఎవరి కోసం తయారు చేస్తున్నాడు అన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు. ఇక ఈ వీడియోని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: