మహిళా క్రికెటర్ ప్రతిభకి.. కేటీఆర్ ఫిదా?
అయితే ఇటీవలే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయిన ఒక వీడియో మాత్రం గల్లీ క్రికెట్ అనే అందరి నోళ్ళు మూయిస్తుంది. పురుషుల క్రికెట్ జట్టుకు తమ జట్టు ఎక్కడ తీసిపోదు అన్నది ఈ ఒక్క ఘటన నిరూపిస్తుంది ఇటీవలే ఒక మ్యాచ్లో భారత మహిళల జట్టు కీలక ప్లేయర్ హార్లిన్ డియోల్ క్యాచ్ పట్టిన తీరు అందరినీ ఔరా అనిపిస్తుంది. ప్రస్తుతం హార్లిన్ డియోల్ పట్టిన క్యాచ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా దీనిపై స్పందించిన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు ఎంతో అద్భుతంగా ఉంది అంటూ మెచ్చుకున్నారు ఇలాంటి ప్రతిభ అందరికి ఆదర్శంగా నిలుస్తుంది అంటూ కేటీఆర్ ఇటీవల వ్యాఖ్యానించారు. అంతేకాదు ఇక భారత మహిళా క్రికెటర్ పట్టిన క్యాష్ కి సంబంధించిన వీడియోను కూడా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు కేటీఆర్.
కాగా క్యాచ్ విషయానికోస్తే.. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న మహిళా టీం ఇండియా ఇటీవల తొలి టీ-20 మ్యాచ్ ఆడింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. అయితే మ్యాచ్ జోరుగా సాగుతున్న సమయంలో ఇంగ్లాండ్ బ్యాటర్ జోన్స్ 27 బంతుల్లో 49 పరుగులతో దూకుడు మీద ఉంది ఇలాంటి సమయంలో ఇక భారత బౌలర్ వేసిన బంతిని భారీ షాట్ ఆడింది జోన్స్. ఈ క్రమంలోనే అందరూ కచ్చితంగా సిక్స్ వెళ్తుందని అనుకున్నారు. కానీ బౌండరి దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న హార్లిన్ డియోల్ అద్భుతం చేసింది. గాల్లోకి ఎగిరి బంతి పట్టుకుంది ఇక తన బ్యాలెన్స్ కోల్పోతుంది అని భావించి బంతిని బౌండరీ లోపలకు విసిరి మళ్లీ ఇక బయటనుంచి డైవ్ చేసి క్యాచ్ అందుకుంది. ఇక ఈ క్యాచ్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీనిపై ఎంతో మంది ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు.