టీమిండియాకు షాక్.. ఐసీసీ జరిమానా.. ఎందుకో తెలుసా?
అయితే ఇక ఇంగ్లాండ్ ఇండియా మధ్య జరిగిన టి20 సిరీస్ కూడా మొదటి మ్యాచ్లో ఓటమి పాలు అయింది టీమిండియా మహిళల జట్టు. ఇక చివరి వరకు గెలుస్తుంది అనుకున్న మ్యాచ్ ను చేజేతులారా టీమిండియా జట్టు చేజార్చుకుంది. ఇక ఆ తర్వాత ఇంగ్లాండ్ జట్టు మరొక మ్యాచ్ గెలిస్తే చాలు ఎలాంటి పోటీ లేకుండానే అటు టి20 సిరీస్ ఎగరేసుకు పోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా పుంజుకుంది టీమ్ ఇండియా జట్టు. ఈ క్రమంలోనే రెండవ టీ 20 మ్యాచ్ లో అద్భుతంగా రాణించింది. ఏకంగా 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలోనే టీ20 సిరీస్ గెలిచేందుకు ఇంకా ఆశలను సజీవంగా ఉంచుకుంది టీమిండియా జట్టు.
ఇక అన్ని విభాగాల్లో కూడా అద్భుతంగా రాణించిన టీమిండియా జట్టు మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఇటీవల రెండవ టి-20లో విజయాన్ని అందుకుని జోష్ మీద ఉన్న టీమిండియా జట్టు కు అటు ఐసిసి ఊహించని షాక్ ఇచ్చింది. ఏకంగా భారీ జరిమానా విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఇంగ్లాండ్తో జరిగిన రెండవ టీ 20 మ్యాచ్ లో నిర్ణీత సమయంలో టీమిండియా ఓవర్ల కోటను పూర్తి చేయలేకపోయింది. ఈ క్రమంలోనే స్లో ఓవర్ రేట్ కారణంగా మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించింది. దీంతో టీమిండియా కు ఊహించని షాక్ పగిలింది. కాగా టి20 సిరీస్ ఎవరికి దక్కుతుంది అని ఫలితం తేల్చే చివరి మ్యాచ్ రేపు జరగబోతుంది.