క్రిస్ గేల్ యూనివర్సల్ బాస్ కాదు.. ఇకనుండి?
సాధారణంగా అయితే 40 ఏళ్ల వయసు రాగానే క్రికెట్ ఆటగాళ్లు అందరూ కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తారు. కానీ క్రిస్ గేల్ మాత్రం 40 ఏళ్లు దాటి పోతున్నప్పటికీ ఇంకా యువ ఆటగాళ్లకు పోటీ ఇస్తూ అదే జోష్ లో కొనసాగుతున్నాడు. అంతేకాదు అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతూ పరుగుల వరద పారిస్తున్నాడు క్రిస్ గేల్. రిటైర్మెంట్ గురించి ఎవరైనా అడిగితే చిరునవ్వుతో సమాధానం ఇస్తూ ఉంటాడు. తనకు ఇప్పట్లో రిటైర్మెంట్ తీసుకొనే ఆలోచనే లేదు అంటూ సమాధానం చెబుతూ ఉంటాడు. అయితే క్రిస్ గేల్ ను అందరూ యూనివర్సల్ బాస్ అని అంటూ ఉంటారు. అయితే ఈ పేరు ఎవరో పెట్టింది కాదు ఏకంగా క్రిస్ గేలే పెట్టుకున్నాడు.
అయితే క్రిస్ గేల్ తనకు యూనివర్సల్ బాస్ అనే పేరు పెట్టుకోవడం పై అటు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మాత్రం అభ్యంతరం వ్యక్తం చేసిందట. దీంతో ఇక యూనివర్సల్ బాస్ అని ఉన్న పేరును ది బాస్ కుదించుకున్నాడు . ఇటీవలే ఒక స్పోర్ట్స్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రిస్‌గేల్ ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. తాను యూనివర్సల్ బాస్ అని పిలిపించుకోవడం ఐసీసీ కి ఇష్టం లేదని.. అందుకే కుదించి ది బాస్ అని పెట్టుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. కానీ క్రికెట్ ప్రపంచానికి ఐసీఐ బాస్ అంటూ తెలిపాడు. కానీ నా బ్యాటింగ్‌లో నేనే బాస్ అంటూ వ్యాఖ్యానించాడు.