మీరాబాయి చాను.. చెవి పోగులు వెనుక ఇంత స్టోరీ ఉందా?

praveen
మీరాబాయి చాను.. ప్రస్తుతం భారత దేశ వ్యాప్తంగా మారుమోగి పోతున్న పేరు. ఇటీవలే ప్రారంభమైన  ప్రపంచ క్రీడల పండుగ టోక్యో ఒలంపిక్స్ లో ఏకంగా రజత పతకం తో భారత్ ప్రజలందరి గౌరవాన్ని నిలబెట్టింది. మహిళా వెయిట్ లిఫ్టింగ్ లో అడుగు దూరం లో బంగారు పతకాన్ని దూరం చేసుకున్న మీరాబాయి చాను ఇక సిల్వర్ మెడల్ సాధించి తన సత్తా చాటింది.  అయితే ఇప్పటి వరకు భారత్ తరఫున మహిళా వెయిట్ లిఫ్టింగ్ లో ఒక్కరు కూడా సిల్వర్ మెడల్ సాధించ లేదు అని చెప్పాలి.  దీంతో ఇటీవల టోక్యో ఒలంపిక్స్ లో సిల్వర్ మెడల్ సాధించి భారతదేశ చరిత్రలో సరికొత్త హిస్టరీకి తెరలేపింది మీరాబాయి చాను.  ఒక పేద కుటుంబం నుంచి తెర మీదికి వచ్చిన మీరాబాయి చాను ఎన్నో అవమానాలు ఎన్నో కష్టాలు పడి ఒలంపిక్స్ వరకు చేరుకుంది.


 ఎన్ని కష్టాలు నష్టాలు ఎదురైన కూడా వెనకడుగు వేయకుండా అద్భుతమైన పోరాటపటిమ తో తన లోని ప్రతిభను చాటాలని ఒలంపిక్స్ వరకు వచ్చింది మీరాబాయి చాను. ఈ క్రమంలోనే ఇక ఇటీవలే ఆమె ప్రతిభకు ఫలితం దక్కింది.  ఇక మీరాబాయి చాను సిల్వర్ మెడల్ గెలవడంతో యావత్భారతం మొత్తం సంతోషం లో మునిగి పోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇకపోతే ఇటీవల ఒలంపిక్స్ లో సిల్వర్ మెడల్ గెలిచినందుకు గాను మీరాబాయి చానుకి మణిపూర్ ప్రభుత్వం ఏకంగా కోటి రూపాయల నజరానా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది.  అంతేకాకుండా పోలీస్ శాఖలో ఉన్నతాధికారి ఉద్యోగాన్ని కూడా ఇచ్చేందుకు నిర్ణయించింది మణిపూర్ ప్రభుత్వం.

 కాగా మీరాబాయి రజత పతకం గెలిచిందో లేదో మీరాబాయి కు సంబంధించిన అన్ని అంశాలను తెలుసుకునేందుకు సోషల్ మీడియా ని ఆశ్రయిస్తున్నారు నెటిజనులు. ఈ క్రమంలోనే ఇటీవలే ఒలంపిక్స్ లో మీరాబాయి చాను ధరించిన చెవి పోగులు  గురించి ఒక విషయం వెలుగులోకి వచ్చింది. పోటీ సందర్భంగా మీరాబాయి చాను పెట్టుకున్న చెవిపోగులు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. అచ్చం టోక్యో ఒలంపిక్స్ రింగుల లాగానే ఉన్నా చెవిపోగు లను మీరాబాయి చాను ధరించింది. ఇక ఒలంపిక్స్ కు వెళ్తున్న మీరాబాయి చాను ఎట్టి పరిస్థితుల్లో పథకం సాధించాలి అనే ఉద్దేశంతో ఇంట్లో ఉన్న బంగారం నగదు తో కలిపి తల్లిదండ్రులు మీరబాయ్ చాను కి ఈ ప్రత్యేకమైన చెవి పోగులు చేయించినట్లు తెలుస్తోంది. కాగా చెవి పోగులు ధరించిన మీరబాయ్ చాను ఏకంగా సిల్వర్ మెడల్ అందుకోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: