మార్నింగ్ రాగా : మళ్లీ ఈశాన్యం నుంచి మరో పతకం
మార్నింగ్ రాగా : మళ్లీ ఈశాన్యం నుంచి మరో పతకం
మణిపురం మాణిక్యం మీరాబాయి చాను అందించిన స్ఫూర్తి అసోం దిగ్గజం లవ్లీనా అందుకుంది. త్వరలో పతకంతో స్వదేశాన అ డుగిడబోతోంది..ఈ సందర్భంగా మనం అంతా ఇలాంటి విజేతల నుంచి పొందే స్ఫూర్తి, పొందిన ఆనందం మరో ఒలంపిక్స్ దాకా దాచుకోవాలి. పతకం కైవసం చేసుకునేందుకు కొద్ది గంటల దూరంలోనే ఉంది మన ఇంటి బిడ్డ..ఈ క్రమంలో రాసిన కథనమిది.
నేల మాట్లాడుతోంది..నింగి దీవెనలు ఇస్తుంది. ఈ దేశంలో మౌలిక వసతులు ఏమీ లేకున్నా పోరాడే దిగ్గజాలను ఈ నేల అంది స్తూనే ఉంది. పోరాటం మా రక్తంలో ఉంది అని చాటేందుకు, పోరాటంతోనే ఉనికి సాధ్యం అని ని రూపించేందుకు ఈ దేశం బిడ్డలు ఎ న్నడూ సిద్ధంగా ఉంటూనే ఉంటారు. ఈ దేశం వీరులను అందిస్తుంది. విజేతలనూ అందిస్తుంది. ఈ క్రమంలో మనకు నిరాశలూ అ వమానాలూ అవరోధాలు ఉంటాయి కానీ దేశం నుంచి దే శం వరకూ ప్రవహించే గొప్పనైన విశ్వాసం.. నమ్మకం..అన్నవి గొప్పవి. ఇప్పుడో గొప్ప గెలుపునకు చేస్తున్న నిరీక్షణ కారణంగా మనం అంతా అలసిపోయి ఉన్నాం..మనకు కలలు కావాలి. కలల సాకా రం కావాలి..వాటి కో సం శ్రమను లెక్క చేయని శరీరాలు కావాలి.. అదృష్టం ఈ ఒలంపిక్స్ లో అలాంటి వారే ఉన్నారు..దేశం తరఫు న..దేశం తరఫున మాట్లాడడం గర్వంగా ఉంటుంది..దేశం తరఫున పోరాడడంలో గొప్పనైన ఆత్మ విశ్వాసం ఉం టుంది..ఈ రెండూ ఆ ఈశాన్య రాష్ట్ర బిడ్డలకు తెలుసు. కష్టానికి వెరవని గుణం ఒకటి మనుషుల్లో ఉన్నంత కాలం ఓర్పూ, సహనం రెట్టింపు చేస్తూ ప్ర యాణం చేసినంత కాలం సుదీర్ఘ కాలం అయినా సరే విజయాలు వెంట వ స్తాయి అనేందుకు ఉదాహరణ మీరాబాయి చాను.
మరో ఉదాహరణ లవ్లీనా.. భారత్ తరఫున ఒలంపిక్స్ లో బాక్సింగ్ బరిలో ఉన్న దిగ్గజ క్రీడాకారిణి. బంగారం లాంటి కలలున్న వా రితోనే ఈ దేశం ముందడుగు వేస్తుంది.. కలలు కాదు కలలకు ఊతం ఇచ్చే తల్లిదండ్రులు... వారికి సాయం అందించే తోటి వారు.. వారి అడుగులలో పోరు సంకల్పం నింపే తోటివారు... నైరాశ్యం వద్దు అని చెప్పేవారు మాత్రమే విజేతలను అందిస్తారు. ఇప్పుడు మరో విజేత మన ముందుకు రానున్నారు. చెప్పానుగా నేల నుంచి నింగి వరకూ ఈ విశ్వం నుంచి పొందిన స్ఫూర్తితో వస్తున్నారు లవ్లీనా. ఆమె సెమీస్ కు చేరుకున్నారు.. ఇంకాస్త దూరంలో పతకం ఉంది.. అది ఏదయినా సరే.. ఆ పతాకాన్ని ముద్దాడాలి.. ఈ దేశం మళ్లీ గర్వించా లి.. నేలకు రుణం తీర్చే లక్షణం కొందరిలోనే ఉంటుంది.. ఆ అవకాశం అందుకున్న ఆ ఈశాన్య రాష్ట్రాల బిడ్డలు గొప్పవారు. నేలకు ప్రణమిల్లి చేసే ప్రయాణం లో వాళ్లంతా గొప్పవారు.. బిడ్డల్లారా..! మీరు మరింత నేర్చుకోండి.. మరిన్ని అవకా శాలు అందుకోండి.. తల్లులారా! మా వందనాలు అందుకోండి.