పీవీ సింధూ చెప్పింది విని.. కన్నీళ్లు ఆగలేదు : తైజు-యింగ్

praveen
ఒలింపిక్స్ లో పతకం సాధించడమే లక్ష్యంగా ప్రతి ఒక క్రీడాకారుడు బరిలోకి దిగుతున్నారు. అయితే ఇలా పథకానికి చేరువ అయ్యే సమయంలో ఎన్నో అవాంతరాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. మరికొన్ని సార్లు ఇతర ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి  కానీ ఒక్కసారి బరిలోకి దిగిన తర్వాత ఎన్ని సమస్యలు ఎదురైనా పథకం సాధించాలనే పట్టుదల ముందు అవన్నీ పటాపంచలై పోతుంటాయి. ఇలా ఒలంపిక్స్ లో ఇప్పటివరకు పథకాలు గెలిచినా ఎంతో మంది క్రీడాకారులు ఈ విషయాన్ని నిరూపించారు.



 ఇటీవలె భారత్ కు రజత పతకాన్ని సాధించిన మీరాబాయి చాను పోటీలో పాల్గొంటున్న సమయంలో కడుపు నొప్పితో బాధ పడింది. అయినప్పటికీ లెక్కచేయకుండా ఎంతో అద్భుతంగా బరువులు లేపి ఇక రజత పతకాన్ని సాధించి భారత ప్రజల గౌరవాన్ని నిలబెట్టింది. ఇక ఇప్పుడు మరో అథ్లెట్  కూడా ఇలా ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా సిల్వర్ మెడల్ సాధించుకుంది అన్న విషయం ఇటీవల తెరమీదికి వచ్చింది. ప్రస్తుతం ప్రపంచ నెంబర్వన్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా కొనసాగుతుంది తైవాన్ కి చెందిన తైజు యింగ్ . ఇక ఇటీవలే ఒలంపిక్స్ లో భాగంగా సెమీఫైనల్స్ లో తెలుగు తేజం భారత స్టార్ షట్లర్  పీవీ సింధు తైవాన్ చెందిన తైజు యింగ్ మధ్య హోరాహోరీ పోరు జరిగింది.




 ఇక ఈ పోరులో తైజు యింగ్ ఫై చేయి సాధించగా పి.వి.సింధు ఓటమి పాలైంది. ఇక ఆ తర్వాత జరిగిన పోటీలలో ఇక గెలిచిన తైజు యింగ్ సిల్వర్ మెడల్ సాధించింది. ఇక ఇటీవలే పీవీ సింధు తనతో చెప్పిన మాటలు గురించి ప్రస్తావించింది.  తాను మెడల్ తీసుకుంటున్న సమయంలో పీవీ సింధు తనతో చెప్పిన మాటలు కన్నీళ్లు తెప్పించాయి అంటూ తైజు యింగ్ తెలిపింది.  అందరం పథకాలు తీసుకుంటున్న సమయంలో..  ఇక కాంస్య పతకాన్ని అందుకున్న పీవీ సింధు నన్ను కలిసి మాట్లాడింది. నువ్వు అనారోగ్యంతో బాధ పడుతున్నావ్ అని తెలుసు.. అయినా బాగా ఆడావు... ఈరోజు నీది కాదు అంటూ పి.వి.సింధు చెప్పడంతో ఇక వెంటనే కన్నీళ్లు ఆగలేదు అంటూ తైజు యింగ్ తెలిపింది. దీంతో అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ సిల్వర్ మెడల్ సాధించిన తైజు యింగ్ ఫై ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: