భారత్ - పాక్ మ్యాచ్.. డేట్ ఫిక్స్?

praveen
సాధారణంగా క్రికెట్ మ్యాచ్ అంటే చాలు భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా టీవీలకు అతుక్కుపోతుంటారు. అంతలా భారత్లో క్రికెట్ కూ క్రేజు ఉంది  ఎలాంటి క్రికెట్ మ్యాచ్ వస్తున్న సరే చూడటానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అదే పాకిస్తాన్ భారత్ మధ్య మ్యాచ్ జరుగుతుంది అంటే చాలు ఇక చూసే ప్రేక్షకులు అందరిలో ఉండే ఉత్సాహం అంతా ఇంతా కాదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. భారత చిరకాల ప్రత్యర్థి దేశమైన పాకిస్థాన్ తో మ్యాచ్ అంటే భారత క్రికెట్ ప్రేక్షకులందరికీ ఇక మునుపెన్నడూ లేని ఆసక్తి ముంచుకొస్తుంది. కేవలం భారత క్రికెట్ ప్రేక్షకులకూ మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది ప్రేక్షకులకూ సైతం భారత్ పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్  అసలు సిసలైన మజా ఇస్తుంది.



 అయితే వివిధ కారణాల వల్ల అటు బిసిసిఐ పాకిస్థాన్ తో మ్యాచ్లు ఆడటానికి పూర్తిగా నిషేధించింది. ఈ క్రమంలోనే కేవలం ఐసీసీ ఈవెంట్లు వస్తే తప్ప భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగడం చూడలేకపోతున్నారు ప్రేక్షకులు. అయితే మరికొన్ని రోజుల్లో టి20 వరల్డ్ కప్ జరగబోతుంది అనే విషయం తెలిసిందే. టి20 వరల్డ్ కప్ లో భాగంగా దాయాది దేశమైన పాకిస్తాన్ తో భారత్ డి అంటే డి అనే విధంగా తలపడనుంది. ఇక ఈ మ్యాచ్ కోసం అటు భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.  కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు ఇక టీమిండియా జట్టులో ఉన్న ప్రతి ఆటగాడు కూడా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో అద్భుతంగా రాణించి జట్టుకూ విజయం అందించాలని కోరుకుంటూ ఉంటారు.



 అయితే టి20 వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్ భారత్ జట్ల మధ్య యూఏఈ వేదికగా మ్యాచ్ జరగబోతుంది. ఈ క్రమంలోనే ఇక ఇరు జట్లు కూడా అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ఇక ఇటీవలే టి20 వరల్డ్ కప్ లో భాగంగా చిరకాల ప్రత్యర్థులైన భారత్ పాకిస్థాన్ మధ్య జరగబోయే మ్యాచ్ కి సంబంధించి డేట్ కూడా ఫిక్స్ అయ్యింది. అక్టోబర్ 24వ తేదీన దుబాయ్ స్టేడియంలో భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. అయితే ఇప్పటికే అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు కూడా టి20 వరల్డ్ కప్ జరుగుతుందని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: