కెసిఆర్ సర్.. పాకిస్తాన్ కోడలెందుకు.. మన సింధు ఉందిగా?

praveen
సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఇక తమ తమ రాష్ట్రానికి చెందిన ప్రముఖ క్రీడా కారులను లేదా సినీ ప్రముఖులను రాష్ట్రాలకు బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ అయిన సానియా మీర్జా ను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. ఇక ఎన్నో ఏళ్ల నుంచి సానియా మీర్జా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతుంది. అయితే భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ అయినప్పటికీ సానియా మీర్జా పాకిస్థాన్కు చెందిన క్రికెటర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.



 అంతేకాదు ప్రస్తుతం సానియామీర్జా పాకిస్థాన్లోనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఇక తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా సానియా మీర్జా ను   తొలగించాలి అంటూ ఎన్నో డిమాండ్లు కూడా తెరమీదకు వచ్చాయి. అయితే ప్రతిపక్షాలు ఎన్నిసార్లు డిమాండ్ చేసినప్పటికీ అటు ప్రభుత్వం మాత్రం సానియా మీర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగిస్తూ వచ్చింది. అంతే కాకుండా ఇక తెలుగు రాష్ట్రాల్లో బాగా గుర్తింపు పొందిన క్రీడాకారులు కూడా ఎవరూ లేకపోవడం గమనార్హం. కానీ ఇటీవలి కాలంలో తెలుగు తేజం పీవీ సింధు దేశ గౌరవాన్ని నిలబెడుతూ వరుసగా రెండు ఒలంపిక్స్ లో పతకాలను సాధించింది.



 అంతేకాదు తెలుగు ప్రజలందరి గౌరవాన్ని నిలబెట్టింది పీవీ సింధు. ఈ క్రమంలోనే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ ని మార్చాలి అని డిమాండ్ మరోసారి తెరమీదకు వచ్చింది. ఇటీవలే గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జాను మార్చాలి అంటూ విజ్ఞప్తి చేశారు. పాకిస్థాన్ కోడల్ని బ్రాండ్ అంబాసిడర్ గా తప్పించి భారత్కు రెండు సార్లు పథకం అందించి  తెలుగు ప్రజల గౌరవాన్ని నిలబెట్టిన పీవీ సింధు ని తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించాలి అంటూ కోరారు.  అయితే వరుసగా రెండు ఒలంపిక్స్ లో తెలుగు తేజం పీవీ సింధు పతకాలు సాధించిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ డిమాండ్ మరింత ఎక్కువ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Kcr

సంబంధిత వార్తలు: