ఐపీఎల్ 14 : ఆటగాళ్లకు జీపీఎస్ వాచ్ లు ?

Veldandi Saikiran
 చైనా లో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి మనకు విదితమే. అయితే ఈ కరోనా కారణం గా ఆర్థిక రంగం తో పాటు సినీ మరియు క్రీడా రంగం తీవ్రం గా నష్ట పోయాయి. ముఖ్యం గా క్రీడారంగం పై కరోనా మహ మ్మారి భారం చాలా నే పడింది. ఈ కరోనా మహ మ్మారి కారణం గా.... ఈ ఏడాది వేసవి లో జరగాల్సిన ఐపీఎల్ 14 వ సీజన్ వాయిదా పడింది. దీంతో ఈ సీజన్ ను యూఏఈ లో నిర్వహించనుంది ఐపీఎల్ యాజమాన్యం. అయితే.... యూఏఈ లోనూ ఆటగాళ్ల కు కరోనా సోకే ప్రమాదం లేకపోలేదు. 


ఈ నేపథ్యం లో అబుదాబి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ మ్యాచ్ ల కోసం.. యూఏఈ చేరుకుంటున్న ఆటగాళ్ల కు ఆరు రోజుల పాటు క్వారంటైన్ ఉంచాలని నిర్ణయం తీసుకుంది. అలాగే ఐపీఎల్ ఆటగాళ్ల కదలికల పై.... ఓ కన్ను వేసేందుకు జిపిఎస్ వాచీలను అందించాలని అబుదాబి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.  ఈ జిపిఎస్ వాచ్.... సహాయంతో కరోనా మహమ్మారి ని  కట్టడి చేయవచ్చని ప్రభుత్వం తెలిపింది.


 ఈ జి పి ఎస్ వాచ్ లు ఆటగాళ్లు ధరించడం వల్ల... క్వారంటైన్ లో ఉన్న వారి కదలికలు తెలుసుకోవచ్చని పేర్కొంది. దీంతో కరోనా మహమ్మారి అదుపులోకి వస్తుందని స్పష్టం చేసింది అబుదాబి ప్రభుత్వం. అలాగే దుబాయ్ నుంచి అబుదాబి కి వెళ్లాలంటే కరోనా నెగిటివ్ రిపోర్టు కచ్చితంగా ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. కాగా సెప్టెంబర్ 19 న దుబాయ్ లో చెన్నై మరియు ముంబై మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఇక అటు శ్రీలంక టూర్ లో ఇండియా అల్ రౌండర్ కృనాల్ పాండ్య కరోనా బారిన పడిన సంగతి తెల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: