ప్చ్.. టీమిండియాను తక్కువ అంచనా వేశాం?
దీంతో టీమిండియా జట్టు ఘన విజయం సాధించింది అని చెప్పాలి. కాగా ఓటమి ఫై ఇటీవలే ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ స్పందించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2వ టెస్ట్ మ్యాచ్లో టీమిండియాను తక్కువ అంచనా వేశామని అందుకే చివరికి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు. లోయర్ ఆర్డర్ లో అద్భుతంగా రాణించిన జస్ప్రిత్ బూమ్రా మహ్మద్ షమీ లు గెలుపును తమ వైపుకు లాగేసుకున్నారు అంటూ చెప్పుకొచ్చాడు. తాను కెప్టెన్గా కొన్ని పొరపాట్లు చేశానని.. మ్యాచ్ జరుగుతున్న సమయంలో మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించి కొన్ని విభిన్నమైన మార్పులు చేసి ఉంటే బాగుండేది అంటూ చెప్పుకొచ్చాడు.
రెండవ టెస్ట్ మ్యాచ్లో లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు అయినా బుమ్రా, షమి మధ్య భాగస్వామ్యం ఎంతో గొప్పగా ఉంది. వారి భాగస్వామ్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించి ఉంటే బాగుండేది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. టీమిండియా తప్పేమీ లేదు అంటూ చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీ తన సహజ శైలిలో నే ప్రవర్తించాడు. టీమిండియా ఎంతో నిజాయితీగానే ఆడిందని.. భావోద్వేగం తో పాటు ఎంతో వ్యూహాత్మకంగా ఆడి రెండో టెస్టు మ్యాచ్లో టీమ్ ఇండియా విజయం సాధించింది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మైదానంలో ఆటగాళ్ళ మధ్య తీవ్రమైన వాగ్వాదాలు ఏమీ జరగలేదు అంటూ తెలిపాడు. ఇక రానున్న రోజుల్లో మరింత వ్యూహాత్మకంగా వికెట్లు పడగొట్టెందుకు ప్రయత్నిస్తాము అంటూ చెప్పుకొచ్చాడు జో రూట్.