టి20 వరల్డ్ కప్ ముందు.. కోహ్లీ రహస్య సమావేశం?

praveen
మరికొన్ని రోజుల్లో టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో అటు బిసిసిఐ ఈసారి టి20 వరల్డ్ కప్ గెలవడమే లక్ష్యంగా ఇప్పటినుంచి వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టి20 వరల్డ్ కప్ కి జట్టులో ఎవరినీ సెలెక్ట్ చేయాలి ఎవరిని దూరంగా పెట్టాలి అనే విషయంపై ప్రస్తుతం బీసీసీఐ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల ఏకంగా టీమిండియా డేర్ అండ్ డాషింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లీతో ఒక రహస్య సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది  ప్రస్తుతం లండన్లో రెండవ టెస్ట్ సందర్భంగా బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సెక్రటరీ జెషా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఇటీవలే విరాట్ కోహ్లీ తో ప్రత్యేకంగా సమావేశమై నట్లు తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ గురించి విరాట్ కోహ్లీతో వీరు ఎంతో సుదీర్ఘంగా చర్చలు జరిపారట



 అయితే మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ అటు బిసిసిఐకి మాత్రమే కాదు మరో వైపు విరాట్ కోహ్లీకి   కూడా ఎంతో కీలకంగా మారనుంది. కోహ్లీ కెప్టెన్సీలో ఇప్పటికే టీమిండియా 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే ప్రపంచకప్, 2021 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ కోల్పోయింది. ఈ క్రమంలోనే ఇక రానున్న రోజుల్లో ఐసీసీ ట్రోఫీ ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది కోహ్లీకి. లేదంటే ఇక విరాట్ కోహ్లీ కెప్టెన్సికే ఎసరు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ పెద్దలు అటు విరాట్ కోహ్లీతో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది.



 అయితే ఈ సమావేశానికి సంబంధించి ఎలాంటి సమాచారం మాత్రం బయటకు రాకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఐపీఎల్ తర్వాత ఇక జరగబోయేది టి20 వరల్డ్ కప్ కాబట్టి ఇక ఈ మెగా టోర్నీ కోసం టీమిండియా జట్టును ఎంపిక చేయడం విషయంలో కూడా విరాట్ కోహ్లీతో చర్చలు జరిపారట. ఈ క్రమంలోనే ప్రస్తుతం టి20 వరల్డ్ కప్ జట్టులో ఎవరికి స్థానం దక్కబోతోంది అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఇక ప్రస్తుతం ఏ ఆటగాడు ఎలా రాణిస్తున్నాడు ఎలాంటి ప్రతిభ కనబరుస్తున్నాడూ అనే విషయంపై కూడా బీసీసీఐ విశ్లేషణలు ప్రారంభించిందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: