పాకిస్థాన్ షాక్.. ఆఫ్ఘన్ కీలక నిర్ణయం?

praveen
ప్రస్తుత పరిస్థితుల్లో తాలిబన్లు ఆధిపత్యం సాధించడంతో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే అది దేశ ప్రజలు మొత్తం ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది.  మరికొన్ని రోజుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు తాలిబన్లు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇక ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ భవిష్యత్తు ఏమవుతుందోనన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇటీవలి కాలంలోనే ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు అంతర్జాతీయ క్రికెట్లో బాగానే రాణిస్తుంది.  ఇప్పుడు తాలిబన్ల పాలనలో  ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయన్నది ఊహించని విధంగా మారిపోయింది. దీంతో ఇక ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు రాబోయే రోజుల్లో  అంతర్జాతీయ మ్యాచ్లు ఆడుతుందా లేదా అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.



 ఆఫ్ఘనిస్తాన్ లో నెలకొన్న అల్లకల్లోల పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది  . సెప్టెంబర్ 3వ తేదీ నుంచి శ్రీలంక వేదికగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు  మూడు వన్డేల సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే ఈ సిరీస్ ను వచ్చే ఏడాదికి వాయిదా వేస్తూ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో తమ క్రికెటర్గా మానసిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ తో మూడు వన్డేల సిరీస్ ఆడాలని అనుకున్న పాకిస్థాన్ కి ఊహించని షాక్ తగిలింది.



 ఆఫ్ఘనిస్థాన్లో  అల్లకల్లోల పరిస్థితులు ఉన్నప్పటికీ అవన్నీ పట్టించుకోకుండా పాకిస్థాన్ మాత్రం ఆఫ్ఘనిస్తాన్ తో ఎలాగైనా సిరీస్ ఆడాలని భావించింది. ఈ క్రమంలోనే ఇటీవల ఇరు దేశాల క్రికెట్ బోర్డులు వర్చువల్ సమావేశమయ్యాయి. ఇక ఈ సమావేశంలో పాకిస్థాన్లో మూడు వన్డేల సిరీస్ ఆడటానికి ఇరు దేశాల క్రికెట్ బోర్డులు  అంగీకారానికి కూడా వచ్చాయి. కానీ చివరికి ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ కోర్టు తన నిర్ణయాన్ని మార్చుకుంది. వన్డే సిరీస్ను వచ్చే ఏడాదికి వాయిదా వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో అటు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కు ఊహించని షాక్ తగిలింది. ఆఫ్ఘనిస్తాన్ పాలనలో తమ దేశ క్రికెట్ కు ఎలాంటి నష్టం జరగకూడదు అని ఆశిస్తున్నాము అంటూ ప్రస్తుతం క్రికెట్ బోర్డు అధికారులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: