తాలిబన్లపై పాక్ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్.. వైరల్ వీడియో?

praveen
ఆయుధాలు చేతపట్టి ప్రజలను దారుణంగా చంపుతూ..  అందరినీ బానిసలుగా మార్చుకుంటూ ఇక మహిళలను నీచాతి నీచంగా చూస్తూ ఆధిపత్యాన్ని చేపట్టారు తాలిబన్లు.  అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఉపసంహరించుకోవడం మొదలు పెట్టిన తర్వాత తాలిబన్లు సృష్టించిన అరాచకాలు అంతా ఇంతా కాదు. ఏకంగా దేశాన్నే తమ వశం చేసుకొని ప్రజలను బానిసలుగా మార్చుకున్నారు.  ఆఫ్ఘనిస్తాన్  ప్రభుత్వం లొంగిపోవడం.. అమెరికా సైన్యం ఉపసంహరించుకోవడంతో ఆఫ్ఘనిస్థాన్లో తాలిబాన్లకు అడ్డూ అదుపు లేకుండా పోయింది అని చెప్పాలి.



 అయితే ప్రజలందరినీ క్షమిస్తున్నామని.. ఎవరి ప్రాణాలు తీయమని ఇక మహిళల కు తమ ప్రభుత్వంలో కూడా స్థానం కల్పిస్తామని అంతేకాకుండా మహిళలకు రక్షణ ఏర్పాటు చేస్తాము అంటూ స్టేట్ మెంట్ల మీద స్టేట్మెంట్లు ఇస్తున్నారు.  అయినప్పటికీ అటు తాలిబన్ల మాటలు మాత్రం అంతర్జాతీయ సమాజం నమ్మడం లేదు.  అయితే ఇటీవల కాలంలో తాలిబన్లు ముసుగు తొలగిస్తూ ప్రజలందరినీ దారుణంగా హతమార్చడం హింసించడం లాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.  ఆ సమయంలో అటు అంతర్జాతీయ సమాజం మొత్తం ఆఫ్ఘనిస్తాన్ లో నెలకొన్న పరిస్థితుల గురించి ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవలే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.


 ఇప్పటికే పాకిస్థాన్ డైరెక్టుగానే తాలిబన్లకు మద్దతు ఇస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఏకంగా షాహిద్ అభివృద్ధి చేసిన వ్యాఖ్యలు అందరినీ షాక్ కి గురి చేస్తున్నాయి.  తాలిబన్లు ఈసారి ఎంతో పాజిటివ్ వస్తారు అంటూ షాహిద్ ఆఫ్రిది వ్యాఖ్యానించారు. ఇక తాలిబన్లు అటు మహిళలనూ తమ పని తాము చేసుకునేందుకు కూడా అనుమతిస్తారు అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తాలిబన్లు అటు క్రికెట్ ని కూడా ఎంతో ఇష్టపడతారని క్రికెట్ పై ఎలాంటి ఆంక్షలు విధించబోరు అంటూ షాహిద్ అఫ్రిది తెలిపాడు. షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలపై అటు ఎంతోమంది నెటిజన్లు మాత్రం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు    షాహిద్ ఆఫ్రిది తాలిబన్లకు నెక్స్ట్ పిఎం కాబోతున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: