ఒక్క పరుగు.. ఒకే ఒక పరుగు.. కోహ్లీ అరుదైన రికార్డు?
ఈ క్రమంలోనే ఇక ఆధిపత్యం సాధించేందుకు రెండు జట్లు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నాయ్. ఇదిలా ఉంటే మరోవైపు అటు నాలుగో టెస్టు ప్రారంభం ముందు టీమ్ ఇండియా లోని కీలకమైన ఆటగాళ్లను ఎన్నో రికార్డులు ఊరిస్తూ ఉండటం గమనార్హం. ప్రస్తుతం టీమిండియా జట్టు కెప్టెన్గా జట్టులో కీలక బ్యాట్స్మెన్ గా ఉన్న విరాట్ కోహ్లీ ఒక అరుదైన రికార్డు ఊరిస్తుంది. విరాట్ కోహ్లీ కేవలం ఒకే ఒక్క పరుగు చేస్తే చాలు అంతర్జాతీయ క్రికెట్లో ఏకంగా ఇరవై మూడు వేల పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా అరుదైన రికార్డును సొంతం చేసుకుంటాడు.
ఇక మరోవైపు రోహిత్ శర్మ కేవలం ఇరవై రెండు పరుగులు చేస్తే చాలు అంతర్జాతీయ క్రికెట్ లో 15000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో చేరిపోయాడు. టీమ్ ఇండియా లో కీలక బౌలర్ గా ఉన్న జస్ప్రిత్ బూమ్రా మరో మూడు వికెట్లు తీశాడు అంటే టెస్ట్ క్రికెట్ లో ఏకంగా వంద వికెట్ లు తీసిన బౌలర్గా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇక మరోవైపు అటు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ మరో ఐదు వికెట్లు తీశాడు అంటే టెస్ట్ క్రికెట్ లో 200 వికెట్లు పడగొట్టిన వీరుడిగా అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంటాడు. ఇలా నాలుగు టెస్ట్ మ్యాచ్ ముందు టీమిండియా ఆటగాళ్లను అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి. మరి నాలుగో టెస్టులో ఈ ఆటగాళ్లు ఎలా రాణిస్తారు అన్నది చూడాలి మరి.