తిట్టినందుకు త్రిబుల్ సెంచరీ చేశా.. ప్రతీకారం అంటే ఇదే?

praveen
ఎన్నో ఏళ్ల పాటు టీమిండియాలో తిరుగులేని ఓపెనర్ గా..  అదిరిపోయే బ్యాట్స్మెన్ గా టీమిండియా విజయంలో కీలకపాత్ర వహించి జట్టుకు ఎన్నో మరపురాని విజయాలను అందించిన బ్యాట్స్మెన్ గా నిలిచాడు వీరేంద్ర సెహ్వాగ్.  వీరేంద్ర సెహ్వాగ్ ఒక్కసారి మైదానంలోకి దిగాడు అంటే ఎంత దూకుడుగా ఆడతాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  సింగిల్స్ కాదు సిక్సర్లు ఫోర్లు మాత్రమే లక్ష్యంగా వీరేంద్ర సెహ్వాగ్ బరిలోకి దిగుతాడు.  తన ఆటతో తన ప్రదర్శనతో ఎప్పుడు ప్రేక్షకులను అబ్బుర పరిచే వాడు వీరేంద్ర సెహ్వాగ్.



 కేవలం తన ఆటతో మాత్రమే కాదు ఇక తన దూకుడైన ఆటిట్యూడ్ తో కూడా ఎప్పుడూ వార్తల్లో నిలిచే వాడు.  ఇలా ఎన్నో ఏళ్ల పాటు టీమిండియాకు సేవలు అందించిన వీరేంద్ర సెహ్వాగ్ ప్రస్తుతం ఉన్న దిగ్గజ క్రికెటర్ లలో ఒకరుగా కొనసాగుతున్నారు.  అయితే వీరేంద్ర సెహ్వాగ్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు ఆసక్తికర పోస్టులతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోతూ ఉంటారు.  ఇక ఇటీవల వీరేంద్ర సెహ్వాగ్ పెట్టిన పోస్ట్ కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.



 1999లో పాకిస్తాన్ భారత్ మధ్య జరిగిన మ్యాచ్ విశేషాలను గురించి ఇటీవల అభిమానులతో పంచుకున్నారు.  1999లో పాకిస్తాన్ తో మ్యాచ్ జరిగింది. ఆ సమయంలో  నేను భారత్ తరపున తొలి వన్డే మ్యాచ్ ఆడుతున్నాను. ఇక ఆ సమయంలో ఇక పాకిస్థాన్ క్రికెటర్లు నన్ను దూషించారు అంటూ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో నాకు 21 ఏళ్ళు ఉంటాయి.  నేను బ్యాటింగ్ కు రాగానే అక్తర్,అఫ్రిదీ, యూసఫ్ తిట్టడం మొదలు పెట్టారూ. అసభ్య పదజాలాన్ని కూడా వాడారు అంటూ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత 2003లో పాకిస్తాన్ భారత్ మధ్య జరిగిన మ్యాచ్లో ఏకంగా పాకిస్థాన్ ఫై ట్రిపుల్ సెంచరీ చేసి ప్రతీకారం తీర్చుకున్న అంటూ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ఇప్పటికీ పాకిస్తాన్ భారత్ మ్యాచ్ అంటే చాలు రోమాలు నిక్కబొడుచుకుంటాయి అంటూ తెలిపాడు వీరు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: