భారత్ vs ఇంగ్లాండ్.. గెలిచేది ఆ జట్టే?
ఓవైపు బౌలింగ్ విభాగంలో మరోవైపు బ్యాటింగ్ విభాగంలో కూడా పేలవ ప్రదర్శన చేసి ఏకంగా ఒక ఇన్నింగ్స్ తేడాతో పరాజయం పాలైంది టీమిండియా జట్టు. ముఖ్యంగా టీమిండియా జట్టులో టాప్ క్లాస్ బ్యాట్స్మెన్లు ఉన్నప్పటికీ అటు సరైన ప్రదర్శన చేయలేకపోవడం మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలకు తావిచ్చింది . ఇక ఇప్పుడు నాలుగో టెస్ట్ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే ఇక నాలుగో టెస్టు మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్న విషయంపై అటు భారత మాజీ క్రికెటర్లు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇటీవలే భారత దిగ్గజ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ టెస్ట్ మ్యాచ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాలుగవా టెస్టులో టీమిండియా కి ఎక్కువగా గెలిచే అవకాశాలు ఉన్నాయి అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. భారత ఆటగాళ్లు అందరూ తప్పకుండా గెలవాలన్న కసితో కనిపిస్తున్నారు అంటూ వీవీఎస్ లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు. మూడవ రోజంతా బ్యాటింగ్ చేయగలిగితే టీమ్ ఇండియా ఇంగ్లాండ్ జట్టు పై పైచేయి సాధించే అవకాశం ఉంటుంది అంటే తెలిపాడు. ఇక ప్రత్యర్థి జట్టుకు కనీసం 250 పరుగుల లక్ష్యాన్ని నిర్ధారించాల్సి న అవసరం ఉందని చెప్పుకొచ్చాడు. ఇక టీమిండియా జట్టులో టాప్ క్లాస్ బ్యాట్స్మెన్లు ఉన్నారని అందుకే ఇక నాల్గవ టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపాడు.