పట్టుబిగిస్తున్న ఇంగ్లాండ్ జట్లు !

Veldandi Saikiran
లండన్‌ లోని ఓవెల్‌ వేదికగా భారత్‌ జట్టు మరియు ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు చాలా రసవత్తరంగా కొనసాగతోంది. ఈ టెస్ట్‌ మ్యాచ్‌ నాలుగో రోజు ఆట పూర్తయే సరికి  77 పరుగులు చేసి...  టీమిండియాకు దీటుగా బదిలిస్తోంది ఇంగ్లాండ్. ఓపెనర్లు రోరీ బర్న్స్‌ 31, హమీద్‌ 43 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఇంగ్లాండ్‌ కు మంచి ఊపు నిచ్చారు. దీంతో చివరి రోజు ఆ జట్టు విజయానికి 291 పరుగులు అవసరం ఉన్నాయి. మరోవైపు చేతిలో పది వికెట్లు ఉండగా భారత్‌ విజయం సాధించాలంటే వారిని ఆలౌట్‌ చేయాల్సి ఉంటుంది. 


నాలుగో రోజు ఆట ఫస్ట్ సెషన్‌లోనే భారత్ మూడు కీలక వికెట్లు కోల్పోగా.... ఓవర్‌నైట్ స్కోర్‌కు రవీంద్ర జడేజా 8 పరుగులు జత చేయగా.. రహానే డకౌట్‌గా పెవిలియన్ చేరి... నిరాశ పరిచాడు. ఇక నిలకడగా ఆడుతూ హాఫ్ సెంచరీకి చేరువైన కోహ్లీ..  మొయిన్ అలీ బౌలింగ్‌లో స్లిప్‌లో క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో భారత్ లంచ్ బ్రేక్ సమయానికి 6 వికెట్లకు 329 పరుగులు చేయగలిగింది. ఆ తర్వాత వచ్చిన రిషభ్ పంత్, శార్దూల్ ఠాకూర్ సమయోచితంగా బ్యాటింగ్ చేస్తూ టీమిండియా భారీ స్కోర్‌కు  నాంది పలికారు.


దీంతో రెండో ఇన్నింగ్స్‌లో 466 పరుగులకు ఆలౌటైంది కోహ్లీసేన.. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు రోరీ బర్న్స్, హసీబ్ హమీద్ మంచి ఓపెనింగ్‌ ఇచ్చారు. టీమిండియా బౌలర్లను  సమర్థవంతా ఎదుర్కొంటూ పరు గులు రాబట్టారు ఇంగ్లండ్‌ బౌలర్లు.  ఇక అటు  వికెట్ కోసం కోహ్లీ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఈ జోడీ అవకాశం ఇవ్వలేదు. ఇప్పటికే తొలి వికెట్ 77 పరుగుల భాగస్వామ్యంతో అజేయంగా నిలిచింది ఇంగ్లండ్‌ జట్టు.  ఇక ఇవాళ జరిగే.. మ్యాచ్‌ లో భారత్‌ బౌలర్ల ఆటతీరుపైనే విజయ అవకాశాలుంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: