నేడే చివరి రోజు... ఇండియా గెలిచేనా ?

VAMSI
ఇంగ్లాండ్ మరియు ఇండియా ల మధ్య జరుగుతున్న నాలుగవ టెస్ట్ అంతిమ సమరానికి సిద్దమైంది. మొదటి రోజు నుండి మ్యాచ్ ఫలితం తారుమారు అవుతూ వచ్చింది. ఒకానొక దశలో ఇండియా ఓటమి తప్పదు అనిపించింది. కానీ టీమిండియా ఆటగాళ్లు సమిష్టిగా సెకండ్ ఇన్నింగ్స్ లో పోరాడడంతో పటిష్టమైన టార్గెట్ ను ఇంగ్లాండ్ ముందు ఉంచగలిగింది. ప్రస్తుతానికి ఫలితం తేలడానికి అన్ని అవకాశాలు సమానంగానే ఉన్నాయి. ఇంగ్లాండ్ గెలవొచ్చు, ఇండియా గెలవొచ్చు లేదా మ్యాచ్ ఫలితం డ్రాగా ముగియవచ్చు. అయితే ఈ రోజు ఆఖరి రోజు కావడంతో చేజింగ్ చేస్తున్న ఇంగ్లాండ్ పైనే ఎక్కువగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. అయితే ఇక్కడ భారత్ గెలిచేందుకు కూడా దారులున్నాయి.

అది కూడా ఒక ప్రణాళిక ప్రకారం వెళితేనే, ప్రస్తుతానికి వికెట్ కోల్పోకుండా 77 పరుగులు చేసిన ఇంగ్లాండ్ టీం కొంచెం మెరుగైన స్థితిలో ఉన్నట్లే లెక్క. అయితే ఏ మాత్రం తిరకాసు జరిగినా రెండవ టెస్ట్ లాగా ఇంగ్లాండ్ ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇండియా బౌలర్లు మొదటి ఓవర్ నుండే అటాకింగ్ చేయడం ఫలితాన్ని ఇవ్వొచ్చు. ముఖ్యంగా బుమ్రా మరియు ఉమేష్ యాదవ్ చేత ఎక్కువ ఓవర్లు వేయించడం మంచిది. ఇప్పటికే ఉమేష్ యాదవ్ మొదటి ఇన్నింగ్స్ లో మూడు వికెట్లతో ఇంగ్లాండ్ నడ్డి విరిచాడు. ఉమేష్ యాదవ్ తీసిన వికెట్లలో రూట్, మలన్, ఓవర్ టన్ లు ఉన్నారు. రూట్ మరియు మలన్ మంచి టచ్ లో ఉన్నారు. కాబట్టి వీరు వచ్చినప్పుడు ఉమేష్ యాదవ్ కి బంతి అప్పగించాలి.

మొదటి సెషన్ లో వికెట్ తీయలేకపోతే గెలుపు అవకాశాలు తగ్గిపోతాయి. కాబట్టి మొదటి సెషన్ లోనే వికెట్లను తీసి ఇంగ్లాండ్ ను మరింత ఒత్తిడికి గురి చేయాలి. కొన్ని వికెట్లు పడితే ఆ తర్వాత ఇంగ్లాండ్ గెలుపు కోసం ప్రయత్నించగా డ్రా చేసుకోవడానికి పోరాడుతుంది. ఇదే ప్రయత్నంలో వికెట్లను చేజార్చుకుని సిరీస్ లి ఇండియా ఆధిక్యం సాధించేందుకు కారణమవుతుంది. మరి ఇంకాసేపట్లో జరగనున్న మ్యాచ్ లో ఏమి జరగనుందో చూడాల్సిన  అవసరం ఉంది. మరి కోహ్లీ అండ్ కో ఈ టెస్టు గెలుస్తుందా ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: