ఓటమి పై స్పందించిన కోహ్లీ.. ఏమన్నాడో తెలుసా?
కోల్కతా నైట్రైడర్స్ జట్టు తో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ లో చిత్తుగా బెంగళూరు జట్టు ఓడి పోయింది. దీంతో విజయం తో ఆర్ సి బి ఐపీఎల్ ప్రారంభిస్తుంది అనుకుంటే ఓటమి పాలు కావడంతో అభిమానులు అందరూ అసంతృప్తి చెందారు. అయితే నిన్నటి ఓటమి పై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్లో ఓటమి తమకు మేలు కొలుపు లాంటిది అంటూ చెప్పుకొచ్చాడు. ఈ ఓటమితో ముందు ఏ విషయాలపై దృష్టి సారించాలి అన్నది తెలిసి వచ్చింది అని తెలిపాడు. మంచి భాగస్వామ్యాలు నెలకొల్పటం ఎంతో ముఖ్యం.
అయితే మైదానం లో ఉన్న తేమ వికెట్ ఫై ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది అనే విషయాన్ని ఊహించలేకపోయాము. తొలుత బ్యాటింగ్ చేస్తేనే బాగుంటుంది అభిప్రాయపడ్డా.. ఇక 40 పరుగుల వరకు కూడా జట్టు బాగానే రాణించింది. ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. కానీ ఆ తర్వాత 20 పరుగులకే 5 వికెట్లు చేజారి పోవడంతో ఇక కోలుకునే అవకాశం లేకుండా పోయింది అంటూ విరాట్ కోహ్లీ తెలిపాడు. రెండో దశ ఐపీఎల్ లో మొదట ఓటమి ఎదురవడంతో తర్వాత ఈ విషయంపై దృష్టి సారించాలి అన్నది తెలిసొచ్చింది అంటూ విరాట్ కోహ్లీ తెలిపాడు