గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ యాక్టింగ్ ఇరగదీశాడు.. వైరల్ వీడియో?
అసమాన్యమైన ప్రతిభ కనబరచి గోల్డ్ మెడల్ దక్కించుకున్నాడు నీరజ్ చోప్రా. ఇలా భారత గౌరవాన్ని నిలబెట్టిన నీరజ్ చోప్రాకి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా భారీగా నజరానాలు ప్రకటించాయ్. అంతేకాదు 130 కోట్ల భారత ప్రజానీకం మొత్తం కొన్ని రోజులపాటు నీరజ్ చోప్రా పై ప్రశంసల వర్షం కురిపించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అప్పటి వరకు ఎవరికీ తెలియని నీరజ్ చోప్రా ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ రావడంతో ఒక్కసారిగా సూపర్ స్టార్ గా మారిపోయాడు. ఒలంపిక్స్ లో తన ప్రతిభతో గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రా ఇక ఇప్పుడు తన యాక్టింగ్ తో కూడా అందరిని మెస్మెరైజ్ చేస్తున్నాడు .
ఇటీవలే గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా ఒక యాడ్ లో నటించాడు. అయితే ఆ యాడ్ లో భాగంగా ఏకంగా విభిన్న క్యారెక్టర్లు ప్లే చేసి స్టెప్పులు డైలాగులతో అదరగొట్టాడు నీరజ్ చోప్రా. సాధారణంగా క్రీడాకారులకు నటనతో టచ్ ఉండదు. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు యాడ్స్ లో నటించడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ నీరజ్ మాత్రం ఎంతో సునాయాసంగా ఎంతో స్టైల్‌గా నటించి అభిమానులందరినీ ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం ఇక ఈ యాడ్ సంబంధించిన వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది.