ఐపీ ఎల్ 14 సీజన్ రెండో భాగం లో తమ వరుస పరా జయాల కు ఎట్ట కేలకు చెక్ పెట్టింది సన్ రైజర్స్ హైదరా బాద్ జట్టు. ఈ సీజన్ లో రెండో విజయాన్ని నమోదు చేసింది సన్ రైజర్స్ హైదరా బాద్. రాజస్థాన్ రాయల్స్ తో సోమ వారం జరిగిన లీగ్ మ్యాచ్ లో సమష్టి గా రాణించి 7 వికెట్ల తేడా తో విక్టరీ కొట్టింది సన్ రైజర్స్ హైదరాబాద్. మరో వైపు ఈ ఓటమి తో రాజస్థాన్ రాయల్స్ కు ప్లే ఆఫ్స్ ఆశలు సంక్లిష్ట మయ్యాయి. టాస్ గెలిచి ముందు గా బ్యాటింగ్ చేసి... 20 ఓవర్ల లో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది రాజ స్థాన్ రాయల్స్ జట్టు.
రాజ స్థాన్ రాయల్స్ బ్యాటింగ్ వివరాల్లో కి వెళితే... ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ 57 బంతుల్లో 82 పరుగులు, యశస్వీ జైస్వాల్ 23 బం తుల్లో 36 రన్స్ చేసి రాణించారు. అయితే.... రాజస్థాన్ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని విలియమ్సన్ సేన 18.3 ఓవర్ల లో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. హైదరాబాద్ ఆటగాడు జేసన్ రాయ్ 60, కెప్టెన్ విలియమ్సన్ 51 పరుగులు చేసివిజయాన్నందించారు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు.
అర్ధ సెంచరీ తో చెలరేగి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కు విజయాన్ని అందించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు జేసన్రాయ్. ఇక హైదరాబాద్ బౌలర్ల లో సిద్దార్థ్ కౌల్ రెండు వికెట్లు తీయగా.. సందీప్ శర్మ, భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్కు తలో వికెట్ పడగొట్టి రాజస్థాన బ్యాట్స్ మెన్ల నడ్డి విరిచారు. వరుస ఓటముల నుంచి తీవ్ర ఒత్తిడిలో పడిపోయిన ఆరెంజ్ ఆర్మీకి.. తాజా విజయం మళ్లీ ఊపు లోకి వచ్చింది.