డిపెండింగ్ ఛాంపియన్స్ ముంబై ప్లే ఆప్స్ కు చేరేనా?

VAMSI
ఐపీఎల్ 14 సీజన్ లో భాగంగా గ్రూప్ స్టేజి లో ఇక మిగిలింది కొన్ని మ్యాచ్ లే కావడంతో ప్లే ఆప్స్ కు చేరే జట్లపై రకరకాల ఊహాగానాలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి పాయింట్ల పట్టికను ఒకసారి పరిశీలిస్తే చెన్నై మరియు ఢిల్లీ జట్లు దాదాపుగా ప్లే ఆప్స్ చేరినట్లే లెక్క. ఇక మిగిలిన రెండు స్థానాల కోసం రసవత్తర పోటీ జరగనుంది. ఇక గ్రూప్ స్టేజ్ పూర్తి కావడానికి పదమూడు మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇక ఇప్పటికే ఈ ప్లే ఆఫ్ రేసు నుండి అధికారికంగా సన్ రైజర్స్ ఇంటి బాటపట్టింది. క్రికెట్ పరిశీలకుల విశ్లేషణల ప్రకారం అన్ని జట్లకు సమాన అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే అందరి దృష్టి ఇప్పుడు డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ మీదనే ఉంది. గత సంవత్సరం కూడా ఇదే విధంగా మొదటి మ్యాచ్ లలో ఓటమై పలు అవుతూ చివరికి వరుసగా మ్యాచ్ లు గెలుస్తూ ప్లే ఆప్స్ కు చేరి అనూహ్యంగా టైటిల్ ను ఎగరేసుకుపోయింది. అయితే ఈ సారి ముంబై ప్లే ఆప్స్ చేరుకోవడం కొంచెం కష్టమేనని తెలుస్తోంది. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. అయితే ఒకరిద్దరి ఆడడం మూలంగానే ఈ సీజన్ లో గెలుస్తూ వచ్చింది. నిన్నటి మ్యాచ్ తర్వాత ముంబై ఆడిన 11 మ్యాచ్ లలో 5 మ్యాచ్ లు గెలిచి ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.

ఇక రోహిత్ సేనకు మిగిలింది 3 మ్యాచ్ లు, మరియు ఆటగాళ్ల ఫామ్ లేమితో ఇబ్బంది పడడం కారణంగా ప్లే ఆఫ్ అవకాశాలు క్లిష్టమనే తెలుస్తోంది. అయితే ముంబై ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవ్వరూ ఊహించలేము. కాబట్టి ముంబై ఫ్యాన్స్ ఇంకా రోహిత్ సేనపై గట్టి నమ్మకంతో ఉన్నారు. మిగిలిన మూడు మ్యాచ్ లు గెలిచి ప్లే ఆప్స్ కు చేరుకుంటారని గట్టిగా నమ్ముతున్నారు. మరి చూద్దాం ముంబై ప్లే ఆప్స్ కు చేరుకుంటుందా ? ఫ్యాన్స్ ఆశలు ఫలిస్తాయా తెలియాలంటే ఇంకో కొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: