అది రోహిత్ చేతిలో లేదు.. ఆకాష్ చోప్రా షాకింగ్ కామెంట్స్?
అయితే ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే ఆడుతూ ఎప్పుడూ పాయింట్స్ టేబుల్ లో టాప్ ప్లేస్ లో కొనసాగుతూ ఉంటుంది ముంబై ఇండియన్స్ జట్టు. ఇక వరుస విజయాలు సాధిస్తూ దూసుకు పోతూ ఉంటుంది. అయితే అటు ముంబై ఇండియన్స్ జట్టులో కెప్టెన్గా రోహిత్ సక్సెస్ అవుతూ ఉండటం.. అదే సమయంలో జట్టులో బ్యాటింగ్ విభాగం కూడా ఎంతో పటిష్టంగా మారి పోవడం.. మరోవైపు బౌలింగ్ విభాగం కూడా ఎంతో బలం గా మారడం జట్టుకు ఎంతో ప్లస్ పాయింట్ గా మారిపోయింది. గత రెండు సీజన్ ల వరుసగా టైటిల్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ఇక ఈ సారి మాత్రం పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తుంది అని చెప్పాలి.
ఐపీఎల్లో ఐదుసార్లు టైటిల్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు కనీసం ఈ సారి ప్లే ఆప్ కి అర్హత సాధిస్తుంద లేదా అన్నదానిపై అనుమానాలు నెలకొన్నాయ్. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టు పేలవ ప్రదర్శన చేస్తుంది. ముంబై ఇండియన్స్ జట్టు ప్లే ఆఫ్ చేరే అవకాశం పై మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోహిత్ సేన ప్లే ఆఫ్ చేరే అదృష్టం వారి చేతిలో లేదు. ముంబై ఇంకా రెండు మ్యాచ్ లు ఆడాలి రెండింటిలో గెలిచిన 14 పాయింట్లు మించి ఆ జట్టు వెళ్ళలేదు ముంబయ్ జట్టు 3,4 జట్లతో పోటీ ఉండే చాన్స్ ఉంది అంటూ ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.