అరంగేట్రం మ్యాచ్లోనే అరుదైన రికార్డ్?

praveen
సాధారణంగా ఎంతో మంది యువ ఆటగాళ్లు అంతర్జాతీయ జట్టులో స్థానం సంపాదించడానికి సరైన అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు.  తమ ప్రతిభను నిరూపించుకుని అందరి చూపు ఆకర్షించే సమయం రాకపోతుందా అని ఎదురు చూస్తూ ఉంటారూ. అయితే ప్రతి ఒక యువ ఆటగాడికి అలాంటి ఒక ఫ్లాట్ ఫామ్ బీసీసీఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ఇప్పటివరకూ ఎంతోమంది యువ ఆటగాళ్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అదరగొట్టి తమ సత్తా చాటారు. కేవలం భారత్కు చెందిన ఆటగాళ్లు మాత్రమే కాదు విదేశీ ఆటగాళ్లు సైతం సత్తా చాటి క్రికెట్ ప్రేక్షకులు చూపులు ఆకర్షించారు అనే చెప్పాలి.



 ఇప్పటికే ఎంతో మంది యువ ఆటగాళ్లు తమ ప్రతిభను చాటి అందర్నీ ఆశ్చర్య పరచడమే కాదు క్రికెట్ లో యువ సూపర్ స్టార్ గా మారిపోయారు.  ఇక గత ఏడాది ఐపీఎల్ సీజన్ యువ బౌలర్ నటరాజన్ తన యార్కర్ బంతులతో అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక బౌలర్గా మారిపోయి జట్టు విజయంలో ముఖ్యపాత్ర వహించాడు. ఐపీఎల్లో బాగా రాణించిన నటరాజన్ కు ఆ తర్వాత  వరుసగా టీమిండియాలో 3 ఫార్మాట్లలో కూడా చోటు దక్కడం గమనార్హం.  అయితే ఇక ఈ ఏడాది ఐపీఎల్లో అదే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కొత్త బౌలర్ వెలుగులోకి వచ్చాడు.



 ఇటీవలే నటరాజన్ కరోనా వైరస్ బారిన పడటంతో అతని స్థానంలో ఊమ్రాన్ మాలిక్ అనే బౌలర్ ను జట్టులోకి తీసుకుంది యాజమాన్యం. ఇక ఇటీవల అరంగేట్రం మ్యాచ్లోనే ఉమ్రాన్ మాలిక్ అరుదైన రికార్డ్  నమోదు చేశాడు. తన బౌలింగ్ స్పీడ్ తో అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. ఐపీఎల్ లో రెండో అత్యంత వేగవంతమైన బాల్ విసిరాడు ఉమ్రాన్ మాలిక్. నిన్న కోల్కత్త తో జరిగిన మ్యాచ్ లో మాలిక్ గంటకు 151.03 కిలోమీటర్ల వేగంతో బంతి విసిరి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఇప్పటివరకు కోల్కతా బౌలర్ పెర్గ్యూసన్ గంటకు 152.75 కిలోమీటర్ల వేగమే ఐపీఎల్ లో టాప్ లో కొనసాగుతోంది. ఇక మొన్నటివరకు రెండవ స్థానంలో మొహమ్మద్ సిరాజ్ ఉండేవాడు 145.97 కిలోమీటర్ల వేగంతో గతంలో మహమ్మద్ సిరాజ్ బంతులు విసిరి రెండవ స్థానం దక్కించుకున్నాడు. ఇప్పుడు సన్రైజర్స్ బౌలర్ అరంగేట్రం మ్యాచ్లోనే అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: